వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమతా మంత్రుల రాజీనామా-వాజ్‌పేయి నో Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కేంద్రంలోనివాజ్‌ పేయి సర్కార్‌ కు దెబ్బమీద దెబ్బ తగులుతున్నది.తెహల్కా వెల్లడించిన అవినీతి బాగోతం రగిల్చినసంక్షోభం వాజ్‌ పేయి సర్కార్‌ పీకలమీదకు తెచ్చింది. క్షణక్షణంఅనూహ్య పరిణామాలతో ఢిల్లీ రాజకీయ వాతావరణం వెడెక్కుతున్నది. రక్షణ మంత్రి జార్జిఫెర్నాండెజ్‌ రాజీనామా చేసినప్పటికీ, ఎన్డీఏ సర్కార్‌ కుమద్దతు ఉపసంహరించుకుంటానని తృణమూల్‌ అధినేత్రిమమతా బెనర్జీ ప్రకటించారు. దీనితో లోక్‌ సభలో అంతంత మాత్రంగావున్న ఎన్డీఏ బలం మరింత తగ్గింది.

పులిమీద పుట్రలాగా తమనాయకుడు జార్జి ఫెర్నాండెజ్‌ పై వత్తిడి చేసి రాజీనామా చేయించిన ఎన్డీఏ సర్కార్‌లో కొనసాగడం భావ్యంకాదంటూ సమతా పార్టీకిచెందిన కేంద్ర మంత్రులు నితీష్‌కుమార్‌, శ్రీనివాస ప్రసాద్‌, దిగ్విజయ సింగ్‌ లు గురువారం రాజీనామాచేయడంతో ప్రధాని వాజ్‌ పేయి దిగ్భ్రాంతికిలోనయ్యారు.

వారి రాజీనామాలను ఆమోదించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. జార్జి, మమతాబెనర్జీ, అజిత్‌ కుమార్‌ పాంజాల రాజీనామాలను ప్రధానిఆమోదించారు. సమతా పార్టీ నేతలను బుజ్జగించి ఎన్డీఏ సర్కార్‌లో కొనసాగేలా చేసే బాధ్యతను సీనియర్‌ బిజెపినాయకులు వెంకయ్య నాయుడు, ప్రమోద్‌ మహాజన్‌ కు ప్రధానిఅప్పగించారు. వారు కూడా రాజీనామా చేస్తే ఎన్డీఏకూటమిలో సంక్షోభం మరింత తీవ్రరూపంధరిస్తుందని ప్రధాని ఆందోళన చెందుతున్నారు. తృణమూల్‌కాంగ్రెస్‌ పార్టీకి తొమ్మిది మంది లోక్‌ సభ సభ్యులేవుండగా సమతా పార్టీకి 12 మంది ఎం.పి.లు వున్నారు. ఈ పార్టీ కూడా ఎన్డీఏనుంచి వైదొలిగిదే వాజ్‌ పేయి సర్కార్‌ మైనారిటీలో పడిపోయేప్రమాదం వుంది. లోక్‌ సభలో ఎన్డీఏ కూటమి బలం గురువారంమధ్యాహ్నం వరకు 300 గా వుంది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరణతో ఎన్డీఏ సర్కార్‌ బలం 291కి తగ్గింది. లోక్‌ సభలో సాధారణమెజారిటీ వుండాలంటే 272 మంది సభ్యులమద్దతు అవసరం. లోక్‌ సభలో 29మంది సభ్యులువున్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సర్కార్‌ కు వెలుపలనుంచి మద్దతు ఇస్తున్నది. తెలుగుదేశంతో పాటుశివసేన, డి.ఎం.కె.లో ప్రస్తుతం వాజ్‌ పేయికిఅండగా నిలిచాయి. లోక్‌ సభలో బిజెపికి 182,కాంగ్రెస్‌ కు 112 సీట్లు వున్న విషయం విదితమే.

  • సంక్షోభంలో వాజ్‌పేయి సర్కార్‌
  • రక్షణ మంత్రి జార్జ్‌ రాజీనామా
  • బసు సారథ్యంలో లోక్‌మోర్చా
  • కేంద్రానికి మమతా గుడ్‌ బై
  • అసెంబ్లీలోనూ రక్షణ కొనుగోళ్ల ప్రకంపనలు
  • లక్ష్మణ్‌ స్థానంలో జానా కృష్ణమూర్తి!
  • ప్రధాని రాజీనామాకు విపక్షం ఉడుంపట్టు
  • నిజానిజాల నిగ్గు తేలాలిః చంద్రబాబు
  • పెద్ద చేపలు చిక్కిన వైనం.......
  • లక్ష్మణ రేఖ ఎలా దాటారు?
  • ఎన్డీఏ సర్కార్‌ వెన్నులో వణుకు
  • కెమేరా కళ్ళున్నాయ్‌...ఖబడ్దార్‌
  • రక్షణ లావాదేవీల్లో మామూళ్లు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X