వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షణస్కామ్‌పైసుప్రీం విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తహల్కా డాట్‌ కామ్‌ బయటపెట్టిన రక్షణ శాఖ అవినీతి బాగోతం పై సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో లేదా సిట్టింగ్‌ జడ్జ్‌తో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని వాజ్‌పేయి శుక్రవారం రాత్రి జాతి ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరితంగా చేసిన ప్రసంగంలో ఈ విషయం వెల్లడించారు.

రక్షణ శాఖ లావాదేవీల్లో ప్రభుత్వ ప్రముఖులు ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రక్షణ రంగంలో అవినీతిని సహించేది లేదని ఆరోపణలు నిజమని తేలితే ఎంతవారైనా తాము చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. తనను తన ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధించుకుంటూ అత్యంత ఉద్వేగపూరితంగా వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని రేడియో, టీవీల్లో ప్రసారం చేశారు.

ఒక కీలకమైన అంశం పక్కతోవ పట్టడానికి, రాజకీయక్రీడా వస్తువుగా మారడాన్ని తాము ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించమని ప్రధాని అన్నారు. తహల్కా ఎక్కుపెట్టిన ఆరోపణల్లో ఏ ఒక్క మంత్రికి కూడా ప్రమేయం లేదని ప్రజలు ఈ విషయం గ్రహించాలని ఆయన కోరారు. నాలుగునెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాల్సిందిగా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని కోరుతామని ఆయన చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంలో అసలు నిజం బయటకు రావల్సిన అవసరం వున్నదని ఆయన అన్నారు.ప్రస్తుత దుమారం వల్ల ఆర్ధిక రంగానికి ముఖ్యంగా స్టాక్‌మార్కెట్లకు మరో వైపు రూపాయి విలువకు జరుగుతున్న నష్టాన్ని ఆయన తన ప్రసంగంలో ఎకరువు పెట్టారు. సుస్థిరత, ఆర్ధిక పురోగతని అతిస్వల్పకాలంలోనే తమ ప్రభుత్వం సాధించాయని ఆయన చెప్పారు.

పార్లమెంట్‌ను గతనాలుగురోజులుగా ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయని దీనివల్ల తాను ప్రసారసాధనాల ద్వారా ప్రజలముందుకు రావల్సివచ్చిందని ప్రధాని తన ప్రసంగానికి కారణాలను వివరించారు. ప్రజలకు నిజం తెలియాలని దేశ ప్రయోజనాలే అన్నింటికన్నా పరమోత్కృష్టమని ప్రధాని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X