• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీహార్‌ఎం.పి. కిరాతకం-8మంది మృతి Home Full Story

By Staff
|

పాట్నాః బీహార్‌ లో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదనడానికినిదర్శనంగా శుక్రవారం రాత్రి ఓ సంఘటనజరిగింది. ఆర్జెడీ ఎం.పీ. షాబుద్దీన్‌ అనుచరులుటెన్త్‌ పరీక్షా హాల్‌ లోకి బలవంతంగా వెళ్ళేందుకుప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితోఆగ్రహం చెందిన షాబుద్దీన్‌ అనుచరులు పోలీసులను చితకకొట్టారు. దీనితో సిమాన్‌ పట్టణం ఉద్రిక్తంగా మారింది.

ఈ సంఘటనతో పోలీసులఆగ్రహం కట్టలు తెంచుకుంది. దగ్గర వుండి తమను కొట్టించినఎం.పి. షాబుద్దీన్‌ ను అరెస్టు చేయాలని పోలీసులు జిల్లాకలెక్టర్‌, ఎస్‌.పి. లను డిమాండ్‌ చేశారు. వారునోరు మెదపక పోవడంతో పోలీసులు విధ్వంసకాండకు దిగారు. కలెక్టర్‌ కారును ధ్వసంచేశారు. ఎస్‌.పి. కార్యాలయాన్ని ధ్వసం చేశారు. దీనితో పోలీసులఅధికారులు దిగివచ్చి షాబుద్దీన్‌ ను అరెస్టుచేసేందుకు సిమాన్‌ సమీపంలో వున్న ప్రకాష్‌ పూర్‌వెళ్ళారు. ఆ గ్రామంలో షాబుద్దీన్‌ తలదాచుకున్నాడు. పోలీసులురావడంతోనే షాబుద్దీన్‌ అనుచరులు కాల్పులుజరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిగాయి. బీహార్‌లో అధికార పార్టీ ఎం.పి.కి, పోలీసులకు మధ్యయుద్ధం జరగడం విశేషం.

ఈ ఎదురుకాల్పులసంఘటనలో ఇద్దరు పోలీసులతో సహా 8 మందిదుర్మరణం పాలయ్యారు. పలువురు గ్రామస్థులుకాల్పుల్లో గాయపడ్డారు. బీహార్‌ రాజధాని పాట్నాకు 160 కిలోమీటర్లదూరంలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంసృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X