వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా చెంత తెలుగు ప్రధాని!

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః బెంగుళూరులో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీప్లీనరీ సమావేశాలలో అందరినీ ఆకర్షించినఅశం ఒకటి వుంది. చాలాకాలంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలకు దూరంగా వుంటున్న ఆంధ్ర ప్రదేశ్‌ కు చెందిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుప్లీనరీలో కీలకపాత్ర వహించడమే ఆ ఆసక్తికరమైనఅంశం.

బెంగుళురూ ప్లీనరీలో సోనియా పి.వి.కి పెద్దపీట వేశారు. పక్కనే కూర్చోపెట్టుకొని పలు అంశాల గురించి చర్చించడం సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.పి.వి. కూడా సోనియాతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడడం రాజకీయ విచిత్రమే.

సమావేశంలోఆమె ప్రత్యేకంగా శ్రీనరసింహరావ్‌జీ అంటూ సంభోదించడంగమనార్హం. గత కొద్ది నెలలుగా సోనియా తరుచుఅనేక విషయాల్లో పీవీని సంప్రదిస్తూ వస్తున్నారనిఅంటున్నారు. ప్రస్తుత ప్లీనరీ సమావేశాలకు అవసరమైనఆర్ధిక, రాజకీయ తీర్మానాల ఖరారులో కూడా పీవీ పాత్రవున్నదని అంటున్నారు.

నామమాత్ర మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ళ పాటు ఏ మాత్రం ఒడిదుడుకులు లేకుండా నడిపినపి.వి. నరసింహారావుకు మంచి పేరు వచ్చింది. అయితే అయోధ్య వ్యవహారం, వివిధ కుంభకోణాలు....ముఖ్యంగా జెఎంఎం ముడుపుల కేసు వంటివి ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఆయనకు న్యాయస్థానం జైలు శిక్ష కూడా విధించింది. ఆయన కష్టాల్లో వున్న సమయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మొదలు కొని ఎవరూ ఆయనను ఆదుకోలేదు.

రాజకీయ విచిత్రాలన్నీ తెలిసిన పి.వి. నరసింహారావువీటిని చాలా తేలికగా తీసుకున్నట్లే కనిపించారు. సంయమనంతో వుంటూ మంచి టైం కోసం వేచి చూడడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. తనను తొలగించి కేసరికి పార్టీ పట్టం కట్టపెట్టినా, అయోధ్య తప్పంతా తనమీద రుద్దినా ఇంతకాలం సోనియాను పన్నెత్తు మాట అనకపోవడమే ఈ రోజున బెంగుళూరుప్లీనరీలో ఆయనకు అంతటి ఆదరణ లభించడానికి కారణంగా భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన సారధిలేక చుక్కాని లేని నావలా వున్న కాంగ్రెస్‌ పార్టీకిసీనియర్ల సలహాలు అవసరమనే సోనియా గాంధీ భావించే పి.వి.కిపెద్దపీట వేశారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X