వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ స్కోర్‌ దిశగాఆస్ట్రేలియా; 326/3

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: కీలకమైనమూడో టెస్ట్‌ లో ఆస్ట్రేలియ తొలిరోజు మూడువికెట్ల నష్టానికి 326 పరుగుల భారీస్కోరు సాధించింది.రెండో టెస్ట్‌ లో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళుఈ టెస్ట్‌ లో మాత్రం ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించారు.కోలకతా ఓటమి ఛాయలు ఏమాత్రం కనిపించలేదువారిలో.ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలోకీలకమైన మూడో టెస్ట్‌ ప్రారంభమైంది.టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు బ్యాటింగ్‌ తీసుకొంది.మూడో బంతికి ఓపేనర్‌ స్లేటర్‌ వికెట్‌ ను కోల్పయినప్పటికీఆసీస్‌ బ్యాట్స్‌ మెన్‌ ఏ మాత్రం జంకకుండా భారత్‌బౌలర్లను చీల్చి చెండాడారు. మైఖేల్‌ హేడన్‌,మార్క్‌ వాలు చెలరేగి భారత బౌలర్లపై విరుచుకపడ్డారు.

మూడో వికెట్‌ కు 150 పరుగుల భారీ భాగస్వామ్యంతోస్కోర్‌ బోర్డు పరుగులెత్తించారు. తొలి టెస్ట్‌ ఆడుతున్నలెగ్‌ స్పిన్నర్‌ సాయిరాజ్‌ బహుతులేకు మార్క్‌వా వికెట్‌ దక్కింది. ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌ తో ధాటిగాఆడుతున్న మార్క్‌ వా బహుతులే బౌలింగ్‌లో అవుటవ్వడంతో హేడన్‌, మార్క్‌ వాలభాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కెప్టెన్‌స్టీవ్‌ వా జతకూడడంతో హేడేన్‌ తనబ్యాట్‌ ను మరింత ఝలిపించాడు. తొలిరోజుఆట ముగిసే సమయానికి హేడేన్‌ 147లతో క్రీజ్‌లో ఉన్నాడు. స్టీవా వా 43 పరుగులతో కొనసాగుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X