వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాణించిన భారత్‌ ఓపెనర్లు- స్కోర్‌ 211/1

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: మొదటి సారిగా భారత ఓపెనర్లునిలకడగా ఆడారు. గత రెండు టెస్ట్‌ల్లో విఫలమైన ఓపెనర్లుశివసుందర్‌ దాస్‌, ఎస్‌.రమేష్‌ ఇక్కడఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌ మొదటిఇన్నింగ్స్‌లో ఫరవా లేదనిపించారు. భారత్‌ తనమొదటి ఇన్సింగ్స్‌లో రెండో రోజు సోమవారం ఆటముగిసే సమయానికి ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 211 పరుగులుచేసింది.

రమేష్‌ 61 పరుగులు చేసిషేన్‌ వార్న్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మిగతాఆస్ట్రేలియా బౌలర్లు ఎవరు కూడా భారత బ్యాట్స్‌మెన్‌నునిలువరించలేకపోయారు. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లోఅద్భుతమైన ప్రతిభ కనబరిచిన వి.వి.యస్‌. లక్ష్మణ్‌ ఈమ్యాచ్‌లోనూ తన ప్రతిభ కనబరిచాడు. సోమవారం ఆటముగిసే సమయానికి ఎస్‌.ఎస్‌. దాస్‌ 84పరుగులతోనూ, లక్ష్మణ్‌ 59 పరుగులతోనూక్రీజ్‌లో వున్నారు.

అంతకు ముందు భారతహాఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ చేతి వాటానికిఆస్ట్రేలయా బ్యాట్స్‌మెన్‌ సోమవారం చేతులెత్తేయక తప్పలేదు.ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకుఅలవుట్‌ అయింది. ఆదివారం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 326 పరగులు చేసినఆస్ట్రేలియా భారీ స్కోర్‌ చేస్తుందని భావించారు. అయితే,మంగళవారం ఉదయం బ్యాటింగ్‌కు దిగినఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఒక్కరొక్కరే హర్బజన్‌ సింగ్‌ బౌలింగ్‌ ధాటికిపెవిలియన్‌ దారి పట్టారు. లంచ్‌కు కొద్దిసమయం ఉందనగా ఆస్ట్రేలియా ఆల్‌ అవుట్‌ అయింది.ఆదివారం ఒక్క వికెట్‌ తీసుకున్న హర్బజన్‌ సింగ్‌ సోమవారం ఆరువికెట్లు తీసుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టినహర్బజన్‌ ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో 24 వికెట్లు తీసుకున్నాడు.ఆస్ట్రేలియా తరఫున హెడెన్‌ ప్రదర్శించిన ప్రతిభప్రశంసలందుకుంది. ఆయన 203 పరుగులు చేసిహర్బజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఓపెనర్‌గాదిగిన హెడెన్‌ సంయమనంతో ఆడాడు. భారీ షాట్లు కూడా కొట్టాడు.మార్క్‌ వా 70 పరుగులకు ఆదివారంనాడే అవుట్‌ కాగా,కెప్టెన్‌ స్టీవ్‌ వా 47 పరుగల వ్యక్తిగత స్కోర్‌వద్ద అవుటయ్యాడు. మిగతా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూనిలదొక్కుకోలేక పోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X