• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రక్షణ కుంభకోణంపై పార్లమెంటు స్తంభన

By Staff
|

న్యూఢిల్లీ: తెహెల్కాటేప్‌లు సోమవారం కూడా పార్లమెంటు ఉభయసభలనుకుదిపేశాయి. తెహెల్కా డాట్‌కామ్‌ బయట పెట్టిన రక్షణ కుంభకోణానికి బాధ్యతవహించి ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందేననివిపక్షాలు పట్టబట్టడంతో పార్లమెంటు ఉభయసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. 14మంది పేర్లను తెహెల్కా బయట పెట్టిన తర్వాత పార్లమెంటు ఉభయసభలు స్తంభించడంఇది నాలుగో రోజు.

వాజ్‌పేయి ప్రభుత్వం రాజీనామాచేయాల్సిందేనని కాంగ్రెస్‌, ఆర్‌జెడి, వామపక్షాలు లోక్‌సభసమావేశమైన వెంటనే పట్టుబట్టారు. నినాదాలుచేశారు. దీంతో సభలో గందరగోళంచెలరేగింది. సబ సద్దు మణగకపోవడంతో లోక్‌సభస్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి సభను రేపటికివాయిదా వేశారు.

రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం రాజీనామాచేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభచైర్మన్‌ కృష్ణకాంత్‌ ఎంత చెప్పినా ప్రతిపక్షాలువినలేదు. దీంతో ఆయన సభనుమధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదావేశారు.

కాంగ్రెస్‌పై ప్రభుత్వం ధ్వజమెత్తింది.వ్యవస్థను చక్కదిద్దడంపై కాకుండా వ్యవస్థనుధ్వంసం చేయడంపై కాంగ్రెస్‌ దృష్టిసారించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిమురళీ మనోహర్‌ జోషీ విమర్శించారు.

వాజ్‌పేయి ప్రభుత్వంపై తాముఅవిశ్వాసం ప్రతిపాదించే అవకాశాలు లేవని కాంగ్రెస్‌సూచనప్రాయంగా తెలియజేసింది. బల నిరూపణచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేననికాంగ్రెస్‌ ప్రతినిధి కపిల్‌ సిబాల్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X