• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిబిఐవిచారణకు తిరస్కారం

By Staff
|

హైదరాబాద్‌: ప్రతిపక్ష సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి రాయలసీమ సూట్‌కేస్‌ బాంబుల కుట్రకేసుతో సంబంధం వున్నట్టుగా పోలీసులు చేస్తున్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కాంగ్రెస్‌ పట్టుబట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. తప్పు చేసిన వారే విచారణ కూడా ఎవరితో జరిపించాలో చెప్పడం చిత్రంగా వున్నదని మంగళవారం నాడు శాసన సభలో ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయంపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగిన అనంతరం హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ, సిబిఐ విచారణ సమస్యే లేదని అన్నారు. ఇది రాయలసీమ ముఠాకక్షలకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. ఫాక్షన్‌ నేరాలపై విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే ప్రతిపాదన వున్నదని ఆయన చెప్పారు. కాగా మద్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వ అక్రమాలను తాము బయటపెట్టడంతో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడవేసేందుకే వైఎస్‌ కుమారున్ని బాంబు కుట్రకేసులో ఇరికిస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించారు.

ప్రభుత్వానికి ఏ మాత్రం పోలీసుల ఆరోపణల మీద నమ్మకం వున్న సిబిఐ విచారణ జరిపించాలని, ఆరోపణలు నిజమని తేలితే తన కుమారున్ని ఉరికంబం ఎక్కించడానికి కూడా తాను సిద్ధమేనని సభలో ఒక దశలో ఉద్వేగంగా మాట్లాడుతూ వైఎస్‌ అన్నారు. కాంగ్రెస్‌ను రక్షణలో పడేయాల్సిన అవసరం తమకు లేదని, మద్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ ఆరోపణలకు తాము బెదిరిపోయే పరిస్థితి ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more