వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనర్ధ రాయితీలపైవిచారణ: కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థఉన్నతాధికారులు కొందరికి నిబంధనలకు వ్యతిరేకంగా రాయితీలు కల్పిండంపైవిచారణ జరిపించాలని మంగళవారం కాంగ్రెస్‌ డిమాండ్‌చేసింది. ఆర్థిక సంస్థ ఉన్నతాధికారి మహంతినిబంధనలకు వ్యతిరేకంగా కొందరికి రాయితీలు కల్పించారనికాంగ్రెస్‌ సభ్యుడు డి. నాగేందర్‌ విమర్శించారు. ఒక మంత్రి కుమార్తె బకాయిలనునిబంధనలకు వ్యతిరేకంగా కోటిన్నరరూపాయలు మాఫీ చేశారని ఆయన ఆరోపించారు. ఒక మంత్రి కుమార్తెకుచెందిన విధాత ప్లాస్టిక్స్‌ సంస్థకు కోటిన్నరరూపాయలు మాఫీ చేసినట్లు వచ్చిన వార్తలపైమంగళవారం శాసనసభలో చర్చ జరిగింది.

తన కూతురుకుసంబంధించిన విధాత ప్లాస్టిక్స్‌ సంస్థకు కోట్లరూపాయల బాకీలు మాఫీ చేసినట్లు వచ్చినవార్తలు సరికాదని రోడ్లు భవనాల శాఖ మంత్రికె. విజయరామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారంవివరణ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తనకు తెలిసినంతవరకు ఏ విధమైన అక్రమాలు జరగలేదనిఆయన అన్నట్లు వినికిడి. తన కూతురును అందరిలాంటి సామాన్యమహిళగానే చేస్తామని, తనకుటుంబంలో ఎవరికీ ప్రత్యేక హక్కులువుండవని విజయరామారావు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X