వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సెక్స్‌ 53 పాయింట్లు పతనం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో ప్రధాన స్టాక్స్‌ ధరల పతనం అప్రతిహతంగా సాగుతున్నది. సెన్సెక్స్‌ 53 పాయింట్ల నష్టంతో 3670 వద్ద ముగియగా, నిప్టీ 16 పాయింట్ల నష్టంతో 1171 వద్ద క్లోజయింది. షార్ట్‌ సేల్స్‌ పై నిషేధం ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. డిఎస్‌క్యూ, స్టెరిలైట్‌ ఆప్టికల్‌ ఏడు శాతం చొప్పున నష్టపోయాయి. సత్యం, డిజిటల్‌ ఎక్విప్‌మెంట్‌, ఎస్‌ఎస్‌ఐ నష్టాలను చవిచూశాయి.

పాతతరం స్టాక్స్‌లో భెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, ఐపిసిఎల్‌ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. పద్మాలయా టెలీ, కొచి రిఫైనరీ, బ్లూస్టార్‌, బిర్లా కార్ప్‌, జివి ఫిల్మ్స్‌ లాభాలతో ముగిసాయి.

అమరరాజా బ్యాటరీస్‌, స్టెరిలైట్‌ ఆప్టికల్‌, బాలాజీ టెలీ, డిఎస్‌క్యూ బయో, ఎన్‌ఐఐటి, ఆప్టెక్‌, పోలారీస్‌, మాక్స్‌ నష్టాలతో ముగిసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X