• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాగుంటను సస్పెండ్‌చేయండి: బాబు

By Staff
|

హైదరాబాద్‌: మద్యం కొనుగోళ్లవ్యవహారంలో ప్రభుత్వంపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుమాగుంట శ్రీనివాసులు రెడ్డిని లక్ష్యంగాఎంచుకున్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించినమెక్‌డెవల్‌ పంపిణీదారు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీనుంచి ఎందుకు సస్పెండ్‌ చేయరని ఆయనబుధవారం విలేకరుల సమావేశంలో అడిగారు. అంతకుముందు మద్యం కొనుగోళ్లలో అక్రమాలుజరిగాయంటూ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలనికాంగ్రెస్‌ శాసనసభలో డిమాండ్‌ చేసింది.

అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతోకాంగ్రెస్‌ శాసనసభ కార్యకలాపాలను స్తంభింపజేసింది.పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చెలరేగింది. కాంగ్రెస్‌ సభ్యులుస్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించారు. సభసద్దుమణగక పోవడంతో స్పీకర్‌ కె. ప్రతిభాభారతి సభను గురువారానికివాయిదా వేశారు.

సభ వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రివిలేకరులతో మాట్లాడారు. మద్యంకొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే కాంగ్రెస్‌ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తోందనిఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని కలుషితం చేయాలనేదురుద్దేశం కాంగ్రెస్‌ ఆరోపణల వెనుక వున్నదనిఆయన అన్నారు. తాము డిస్టల్లరీలను అదుపుచేస్తున్నామని, వాటిని కట్టుదిట్టం చేశామనిఆయన చెప్పారు.

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినమెక్‌డెవల్‌ పంపిణీదారుడు మాగుంట శ్రీనివాసులురెడ్డికి మేలు చేయడానికే కాంగ్రెస్‌ మద్యంకొనగోళ్లపై ఆరోపణలకు దిగిందని ముఖ్యమంత్రిఅన్నారు. కొత్త ఆబ్కారీ విధానం అమలులోకి వస్తేమెక్‌డెవల్‌ నష్టపోతుందనే ఉద్దేశంతోకాంగ్రెస్‌కు ఈ దాడికి దిగిందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలనుకాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) ఖండించింది.మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఆత్మరక్షణలో పడినచంద్రబాబు తమపై ఎదురుదాడికి దిగిందని సిఎల్‌పినాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిలేరులతో అన్నారు. ప్రజలను తప్పు దారిపట్టించేందుకే తమపై ప్రభుత్వం ప్రత్యారోపణలుచేస్తోందని ఆయన విమర్శించారు. మేం చేసిన ఆరోపణలమీద సరే, మీరు చేసిన ఆరోపణల మీదనైనా విచారణకు ఆదేశించండి అనిఆయన ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more