వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రసపట్టులో చెన్నయ్‌ టెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః భారత్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నయ్‌ లో జరుగుతున్న మూడవటెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఇప్పటికే భారత్‌ ఆస్ట్రేలియా జట్లు చెరిఒక మ్యాచ్‌ గెలుచుకోవడంతో చెన్నయ్‌ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించినఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టుకు హర్‌భజన్‌సింగ్‌ విజృంభణ మింగుడుపడకుండా తయారయింది.

బుధవారం నాడువిజయవంతంగా మరో నాలుగు వికెట్లను కూల్చిన హర్‌భజన్‌ ఈ సిరీస్‌పై ఆస్ట్రేలియా ఆశలను పూర్తిగా నేలమట్టం చేశారు. అదే సమయంలో భారత్‌కుసీరిస్‌ కైవసం చేసుకునే అవకాశాలను హెచ్చించారు. రెండో ఇన్నింగ్స్‌ బుధవారం ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా కేవలం 131 పరుగుల లీడ్‌తో వుంది. గురువారం నాడు భారత బౌలర్లు మరోసారి తమ ప్రతాపం ప్రదర్శిస్తే ఈ లీడ్‌ మరీ ఎక్కువ పెరిగే అవకాశం లేదు. ఈ మాత్రం పరుగులను భారత బ్యాట్స్‌మన్‌ ఆటఆఖరురోజైన గురువారం నాడు చేయగలిగితే భారత్‌ 2-1 తేడాతో ఈసీరిస్‌ను కైవసం చేసుకుంటుంది.

లంచ్‌ విరామ సమయానికి ఆస్ట్రేలియా వికెట్‌ ఏమీ నష్ట పోకుండా 69 పరుగులు చేసింది. ఆతరువాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌ మెన్‌ వరుసగాపెవిలియన్‌ దారి పట్టారు. హర్భజన్‌ సింగ్‌ స్పిన్‌ మాయాజాలం బాగాపనిచేస్తున్నది.

అంతకు ముందు భారత్‌ 501 పరుగులకు ఆలౌట్‌ అయింది. 480 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ జట్టు మరో 21 పరుగులు చేసి ఆలౌట్‌అయింది. భారత్‌ కు తొలి ఇన్నింగ్స్‌ లో 110 పరుగుల ఆధిక్యం లభించింది. వా సోదరులు ఆస్ట్రేలియా జట్టును ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండువికెట్లు పడితే భారత్‌ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X