హైదరాబాద్: పర్యావరణ, జల సంరక్షణల కోసంఉద్దేశించిన నీరు-భూమి-చెట్టు బిల్లునుసెలెక్ట్ కమిటీకి పంపాలని గురువారం శాసనసభ
హైదరాబాద్: పర్యావరణ, జల సంరక్షణల కోసంఉద్దేశించిన నీరు-భూమి-చెట్టు బిల్లునుసెలెక్ట్ కమిటీకి పంపాలని గురువారం శాసనసభ నిర్ణయించింది.మిత్రపక్షమైన బిజెపితో సహా కాంగ్రెసేతర ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లునుసెలెక్ట్ కమిటీకి పంపాలని కోరాయి. ప్రతిపక్షాల విజ్ఞప్తిని ప్రభుత్వంఅంగీకరించింది. కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్కుగురైనందును సభలో లేరు.
ఎపి రిజిస్ట్రేషన్ బిల్లును కూడాసెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనసభ నిర్ణయించింది. ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడేసెలెక్ట్ కమిటీకి పంపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంవిశేషం. జైళ్ల అభివృద్ధి మండలి బిల్లును శాసనసభమూజువాణీ ఓటుతో ఆమోదించింది. ఈ మండలికి ముఖ్యమంత్రిచైర్మన్గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని జైళ్లను అభివృద్ధిచేయడానికి ఈ బిల్లును ఉద్దేశించినట్లు హోం మంత్రిటి. దేవేందర్ గౌడ్ చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!