వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వీడియోటేప్‌ను పేల్చిన తెహెల్కా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహెల్కాడాట్‌కామ్‌ మరో బాంబు పేల్చింది. స్వయానా మాజీ ఆర్థిక మంత్రి జార్జిఫెర్నాండెజ్‌ నివాసంలో ఒక గుర్తు తెలియనిమధ్యవర్తి ఆయుధ డీలర్ల నుంచి రెండు లక్షలరూపాయలు తీసుకుంటుండగా తీసిన వీడియోటేప్‌ను తెహెల్కా డాట్‌కామ్‌ మేనేజింగ్‌డైరెక్టర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ గురువారం విడుదలచేశారు. తెహెల్కా కట్టుకథలకు సమతా పార్టీబలయిందనే సమతాపార్టీ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రినితీష్‌కుమార్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో తరుణ్‌ తేజ్‌పాల్‌ ఈ వీడియోటేప్‌ను విడుదల చేశారు. సమతా పార్టీ మాజీఅధ్యక్షురాలు జయా జైట్లీ తరఫునమధ్యవర్తి డబ్బులు తీసుకుంటుండగా తీసిన ఈ వీడియోటేప్‌ను విడుదల చేసి తరుణ్‌ తేజ్‌పాల్‌మరో సంచలనం సృష్టించారు.

ఆ వ్యక్తి ఎవరనేది ప్రధానంకాదు. అతను జయాజెట్లీ మనిషి. ఆ మనిషిడబ్బులు తీసుకుంటుండగా వీడియో తీశాం. దాన్నివిడుదల చేశాం అని ఆయన అన్నారు. వీడియోక్లిప్‌ ఫెర్నాండెజ్‌ ఇంటిని, ఆ వ్యక్తి డబ్బులనున్యూస్‌ పేపర్‌ మడతల్లో దాచి పెడుతుంటే తీసినతొమ్మిది నిమిషాల వీడియో టేప్‌ను తరుణ్‌ తేజ్‌పాల్‌విలేకరుల కోసం ప్రదర్శించారు.

తాము శ్రీనివాస ప్రసాద్‌నుప్రస్తావించనే లేదని తరుణ్‌ తేజ్‌పాల్‌ స్పష్టంచేశారు. జయా జెట్లీయే శ్రీనివాస ప్రసాద్‌ పేరును ప్రస్తావించారనిఆయన చెప్పారు. పార్టీ కోసం తాను డబ్బులు తీసుకున్నాననిజయా జెట్లీ స్వయంగా చెప్పిన తర్వాత తమవన్నీకట్టుకథలని సమతాపార్టీ నేతలు అనడంలోఅర్థం లేదని ఆయన అన్నారు.

డిఫెన్స్‌ డీలర్‌గా తమ విలేకరిమరో ఇద్దరు మధ్యవర్తులతో కలిసి జార్జిఫెర్నాండెజ్‌ ఇంట్లోకి వెళ్లారని, ఆయుధడీలర్‌ తన రక్షణ పరికరాన్ని ముందుకు తోస్తూడబ్బులు ఇచ్చాడని, అతను ఆ గదిలో వున్న ఐదోవ్యక్తి అని ఆయన వివరించారు. దీన్ని అంగీకరిస్తూజయా జైట్లీ దాన్ని శ్రీనివాస ప్రసాద్‌కు పంపాలని, జాతీయకౌన్సిల్‌కు ఏర్పాట్లు ఆయనే చేస్తున్నారని జయా జైట్లీఅన్నారని తేజ్‌పాల్‌ చెప్పారు.

జార్జి ఇంట్లోకి ఇద్దరు రక్షణ పరికరాలమధ్యవర్తులు సురేందర్‌ సులేఖ, మేజర్‌ జనరల్‌మురగై డీల్‌ను కుదుర్చుకునే విషయంపై తమవిలేకరితో వివరంగా చర్చించినట్లు తరుణ్‌ తేజ్‌పాల్‌చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X