వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: పార్లమెంటులోపల, వెలుపల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది.తెహెల్కా బయట పెట్టిన కుంభకోణంనుంచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం మరింత బలాన్నికూడగట్టుకోగలదనే విశ్వాసాన్ని వ్యక్తంచేసింది. రెండు రోజుల పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశాన్ని ప్రారంభించిన బిజెపి నూతన అధ్యక్షుడు జనా కృష్ణమూర్తికాంగ్రెస్‌పై విమర్శల జల్లులు కురిపించారు.ప్రజాస్వామ్యసూత్రాలను, సంప్రదాయాలను గాలికి వదిలేసే అంధ ప్రతిపక్షం, బిజెపి పట్ల తీవ్రవిద్వేషం, అధికార కాంక్ష, బాధ్యతారహితమైననాయకత్వం కాంగ్రెస్‌ లక్షణాలుగా మారాయి అని ఆయనఅన్నారు. రక్షణ రంగ కుంభకోణానికి సంబంధించిన ఒక ఆరోపణ కూడా రుజువుకాలేదని, అయినప్పటికీ వారం రోజులుగా కాంగ్రెస్‌ పార్లమెంటును స్తంభింపజేసిందని,ప్రజాస్వామ్య ప్రతిస్పందనగా జరగాల్సిన సవాల్‌తో కూడినచర్చను కాదని కాంగ్రెస్‌ మీరు దిగిపొండి అనేనినాదం ఇస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలహయాంలలో కుంభకోణాలు వెల్లడైనప్పుడు ప్రతిపక్షంచర్చకు, విచారణకు డిమాండ్‌ చేసిందని, వాటికి కూడాకాంగ్రెస్‌ నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు.అందుకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్చకు,విచారణకు సిద్ధంగా వున్నదని, కాంగ్రెస్‌కు ఇది పట్టడంలేదని ఆయన చెప్పారు. సంకీర్ణ ధర్మానికి కట్టుబడి వుండాలనిఆయన ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు విజ్ఞప్తిచేశారు. దేశానికి సేవకు చేసే లక్ష్యంతో పరస్పరవిశ్వాసం, అవగాహన, సర్దుబాటు, స్నేహాల నుంచి ఆవిర్భవించిన ఎన్‌డిఎఆటంకాలు, ఒడిదొడుకులు లేకుండా ముందుకుసాగగలదని ఆయన ఆశించారు. తెహెల్కా బయట పెట్టిన కుంభకోణంపై ప్రభుత్వంన్యాయవిచారణకు ఆదేశించడాన్ని ఆయన ఆహ్వానించారు. ఈవిచారణలో నిజాలు బయట పడాలని, దోషులకు శిక్ష పడాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లుఆయన తెలిపారు. వివాదంలో చిక్కుకుని పార్టీఅధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బంగారు లక్ష్మణ్‌నిర్దోషిగా బయట పడగలరని ఆయన ఆశించారు. ఈఅగ్ని పరీక్ష నుంచి బయట పడిన తర్వాత లక్ష్మణ్‌నువ్యక్తిత్వానికి తగిన విధంగా పార్టీ సేవలకువినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులోపల, వెలుపల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది.తెహెల్కా బయట పెట్టిన కుంభకోణంనుంచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం మరింత బలాన్నికూడగట్టుకోగలదనే విశ్వాసాన్ని వ్యక్తంచేసింది. రెండు రోజుల పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశాన్ని ప్రారంభించిన బిజెపి నూతన అధ్యక్షుడు జనా కృష్ణమూర్తికాంగ్రెస్‌పై విమర్శల జల్లులు కురిపించారు.

ప్రజాస్వామ్యసూత్రాలను, సంప్రదాయాలను గాలికి వదిలేసే అంధ ప్రతిపక్షం, బిజెపి పట్ల తీవ్రవిద్వేషం, అధికార కాంక్ష, బాధ్యతారహితమైననాయకత్వం కాంగ్రెస్‌ లక్షణాలుగా మారాయి అని ఆయనఅన్నారు. రక్షణ రంగ కుంభకోణానికి సంబంధించిన ఒక ఆరోపణ కూడా రుజువుకాలేదని, అయినప్పటికీ వారం రోజులుగా కాంగ్రెస్‌ పార్లమెంటును స్తంభింపజేసిందని,ప్రజాస్వామ్య ప్రతిస్పందనగా జరగాల్సిన సవాల్‌తో కూడినచర్చను కాదని కాంగ్రెస్‌ మీరు దిగిపొండి అనేనినాదం ఇస్తోందని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాలహయాంలలో కుంభకోణాలు వెల్లడైనప్పుడు ప్రతిపక్షంచర్చకు, విచారణకు డిమాండ్‌ చేసిందని, వాటికి కూడాకాంగ్రెస్‌ నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు.అందుకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్చకు,విచారణకు సిద్ధంగా వున్నదని, కాంగ్రెస్‌కు ఇది పట్టడంలేదని ఆయన చెప్పారు.

సంకీర్ణ ధర్మానికి కట్టుబడి వుండాలనిఆయన ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు విజ్ఞప్తిచేశారు. దేశానికి సేవకు చేసే లక్ష్యంతో పరస్పరవిశ్వాసం, అవగాహన, సర్దుబాటు, స్నేహాల నుంచి ఆవిర్భవించిన ఎన్‌డిఎఆటంకాలు, ఒడిదొడుకులు లేకుండా ముందుకుసాగగలదని ఆయన ఆశించారు.

తెహెల్కా బయట పెట్టిన కుంభకోణంపై ప్రభుత్వంన్యాయవిచారణకు ఆదేశించడాన్ని ఆయన ఆహ్వానించారు. ఈవిచారణలో నిజాలు బయట పడాలని, దోషులకు శిక్ష పడాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లుఆయన తెలిపారు.

వివాదంలో చిక్కుకుని పార్టీఅధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బంగారు లక్ష్మణ్‌నిర్దోషిగా బయట పడగలరని ఆయన ఆశించారు. ఈఅగ్ని పరీక్ష నుంచి బయట పడిన తర్వాత లక్ష్మణ్‌నువ్యక్తిత్వానికి తగిన విధంగా పార్టీ సేవలకువినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X