• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జంతు ప్రదర్శనశాలలో జరిగిన సాకీ పులి వధపై సభా సంఘం వేయాలని కాంగ్రెస్‌, మజ్లీస్‌ శనివారం శాసనసభలో డిమాండ్‌ చేశాయి. పులి వధ జరిగి ఆరు నెలలు దాటినప్పటికీ పోలీసులు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, అందువల్ల సభా సంఘం వేసి విచారణ జరిపించడం అవసరమని ఆ పార్టీలు అన్నాయి.సాకి వధ గోళ్ల కోసమో, చర్మం కోసమో జరగలేదని, రక్తం కోసం జరిగిందనేది అర్థం అవుతోందని, మత క్రతువు కోసం పులి రక్తం కోసం సాకీ వధ జరిగిందనే కోణం నుంచి విచారణ జరగడం అవసరమని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. రాజశేఖరరెడ్డితో మజ్లీస్‌ శాసనభా పక్ష నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసి ఏకీభవిస్తూ సభా సంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. సాకీ హత్య జరిగిన చోట రక్తం మడుగును శుభ్రం చేసే అధికారం జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌కు ఎవరిచ్చారని ఆయన అడిగారు. సాకీ వధ కేసులో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫమయ్యారని ఆయన విమర్శించారు.ఈ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డి, ఓవైసీ జీరో అవర్‌లో ప్రస్తావించారు. ఈ సమయంలో అటవీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సభలో లేరు. దీంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రి కోటగిరి విద్యాధరరావు- సభ్యులు చేసిన డిమాండ్‌ విషయాన్ని, సాకీ వధ మత క్రతువు కోసం జరిగిందా, లేదా అనే విషయంలో జవాబు ఇవ్వాల్సిన విషయాన్ని సంబంధిత మంత్రి అయ్యన్న పాత్రుడుకు తెలియజేస్తానని చెప్పారు. ప్రభుత్వ సమాధానానికి సంతృప్తి చెందని మజ్లీస్‌ పక్ష నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జంతు ప్రదర్శనశాలలో జరిగిన సాకీ పులి వధపై సభా సంఘం వేయాలని కాంగ్రెస్‌, మజ్లీస్‌ శనివారం శాసనసభలో డిమాండ్‌ చేశాయి. పులి వధ జరిగి ఆరు నెలలు దాటినప్పటికీ పోలీసులు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, అందువల్ల సభా సంఘం వేసి విచారణ జరిపించడం అవసరమని ఆ పార్టీలు అన్నాయి.

సాకి వధ గోళ్ల కోసమో, చర్మం కోసమో జరగలేదని, రక్తం కోసం జరిగిందనేది అర్థం అవుతోందని, మత క్రతువు కోసం పులి రక్తం కోసం సాకీ వధ జరిగిందనే కోణం నుంచి విచారణ జరగడం అవసరమని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. రాజశేఖరరెడ్డితో మజ్లీస్‌ శాసనభా పక్ష నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసి ఏకీభవిస్తూ సభా సంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. సాకీ హత్య జరిగిన చోట రక్తం మడుగును శుభ్రం చేసే అధికారం జంతుప్రదర్శనశాల క్యూరేటర్‌కు ఎవరిచ్చారని ఆయన అడిగారు. సాకీ వధ కేసులో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫమయ్యారని ఆయన విమర్శించారు.
ఈ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డి, ఓవైసీ జీరో అవర్‌లో ప్రస్తావించారు.

ఈ సమయంలో అటవీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సభలో లేరు. దీంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రి కోటగిరి విద్యాధరరావు- సభ్యులు చేసిన డిమాండ్‌ విషయాన్ని, సాకీ వధ మత క్రతువు కోసం జరిగిందా, లేదా అనే విషయంలో జవాబు ఇవ్వాల్సిన విషయాన్ని సంబంధిత మంత్రి అయ్యన్న పాత్రుడుకు తెలియజేస్తానని చెప్పారు. ప్రభుత్వ సమాధానానికి సంతృప్తి చెందని మజ్లీస్‌ పక్ష నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more