వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తహల్కాపై ఎన్‌డిఎఎదురుదాడి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తహల్కా వ్యవహారంలో ప్రతిపక్షాలు జరుపుతున్న దాడినితిప్పికొట్టేందుకు ఎదురుదాడికి దిగాలని అధికార ఎన్‌డిఎ కూటమిలోని ప్రధానభాగస్వామ్య పార్టీ బీజేపీ నిర్ణయించింది. శనివారం నాడుప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలుఆదివారం నాడు ముగిసాయి.

ఈ సమావేశాల్లో పాల్గొన్నపార్టీనేతలు తహల్కా బయటపెట్టిన రక్షణ శాఖ అవినీతివెనక ప్రతిపక్షాల కుట్రవున్నట్టుగా అభిప్రాయపడ్డారు.తహల్కా బయటపెట్టిన టేపుల కారణంగా తమపదవులకు రాజీనామా చేసిన రక్షణశాఖ మాజీ మంత్రిజార్జ్‌ఫెర్నాండెజ్‌ను, బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌నుసమావేశంలో గట్టిగా సమర్ధించారు. ఈ ఇద్దరునాయకుల నిజాయితీ త్వరలోనే నిరూపణ అవుతుందని బీజేపీనాయకులు పేర్కొన్నారు.

ప్రతిపక్షాలపై ఎదురుదాడిఆదివారం నాడు తలపెట్టిన ఎన్‌డిఎర్యాలీలోనే శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయించారు.ర్యాలీలో ప్రధాని వాజ్‌పేయి తమ ప్రభుత్వానికి ప్రజలమద్దతును కోరుతారని తెలిసింది. తహల్కాఉదంతం నేపథ్యంలో ప్రతికార్యకర్త, నాయకుడు ఆత్మశోధన చేసుకోవాలనివాజ్‌పేయి సూచించారు. తహల్కా వ్యవహారంలో ప్రతిపక్షాలు గోరంతను కొండంతలుగా చేసిప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నాయనివాజ్‌పేయి తూర్పారబట్టినట్టుగా తెలిసింది.

ఈ మధ్య కాలంలో దేశంలోని వివధప్రాంతాల్లో చెలరేగిన మతఘర్షణలు, స్టాక్‌మార్కెట్‌ పతనం,తహల్కా టేపులు అన్నీ ఒక భారీ కుట్రలో భాగమని బీజేపీ జాతీయ కార్యవర్గంఅభిప్రాయపడింది. ఆదివారం నాడు నిర్వహిస్తున్నర్యాలీలో బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, జనాకృష్ణమూర్తి, కుశ్‌భావ్‌ ఠాక్రే వంటివారితో పాటు మిత్రపక్షాల నేతలు జార్జ్‌ఫెర్నాండెజ్‌, రామ్‌విలాస్‌పాశ్వాన్‌, జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌అబ్దుల్లా, శరద్‌యాదవ్‌ పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X