• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రజేష్‌ మిశ్రాకుఢిల్లీ హైకోర్టు నోటీసు

By Staff
|

న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడుజె.కె. జైన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పైఢిల్లీ హైకోర్టు ప్రధాన మంత్రి కార్యాలయంముఖ్య కార్యదర్శి బ్రజేష్‌ మిశ్రాకు సోమవారంనోటీసు జారీ చేసింది. రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌వింగ్‌ (రా) తన రహస్య నివేదికలో పాకిస్థాన్‌కుచెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ఏజెంట్‌గా తనను పేర్కొనడాన్నికొట్టేయాలని కోరుతూ జైన్‌ ఆ పిటిషన్‌ దాఖలుచేసుకున్నారు.

తమ ప్రతిస్పందనలనుమే 7వ తేదీలోగా దాఖలు చేయాలని హైకోర్టున్యాయమూర్తి జస్టిస్‌ విజేందర్‌ జైన్‌కేంద్ర యువజన సర్వీసుల, క్రీడల మంత్రి ఉమాభారతిని, కేబినెట్‌కార్యదర్శి టి.ఆర్‌. ప్రసాద్‌ను, హోం కార్యదర్శి కమల్‌పాండేను అడిగారు.

తమ వాదనలను వినిపించాలని ప్రధాన మంత్రికార్యలయం (పిఎంఒ)లో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీఎస్‌ ఎస్‌ దత్తాను, రా కార్యదర్శిని, ఇంటలిజెన్స్‌డైరెక్టర్‌ను, నెహ్రూ యువక కేంద్రండైరెక్టర్‌ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ప్రతికక్షుల నుంచి ప్రధాన మంత్రిపేరును తీసేయాల్సిందిగా కోర్టు మార్చి 23వ తేదీనజైన్‌ న్యాయవాది పి.ఎన్‌. లేఖీకిసూచించింది. సవరించిన పిటిషన్‌ సోమవారంవిచారణకు వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X