వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయిదేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోవచ్చే 2005 నాటికి సంపూర్ణ అక్షరాస్యతనుసాధించే లక్ష్యం దిశగా ప్రభుత్వం అనేకపథకాలను సిద్ధం చేసిందని ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు గురువారం నాడువెల్లడించారు. అక్షరాస్యతపై అసెంబ్లీలో జరిగినచర్చలో పాల్గొంటూ విద్యారంగానికి ముఖ్యంగా అక్షరాస్యతపథకాలకు కావల్సిన నిధుల కోసం మద్యం పైఅదనంగా పదిశాతం సుంకాన్ని విధించనున్నట్టుగా కూడాఆయన తెలిపారు. ఈ సుంకం ద్వారా లభించే సుమారు 250 కోట్లరూపాయలను మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఉపయోగించి కార్పొరేట్‌సంస్థలు, దాతలు, ఇతర సంస్థలనుంచి సుమారు అంతేమొత్తాన్ని సమీకరించి ఈ మొత్తాన్ని అక్షరాస్యతఅభివృద్ధికి ఉపయోగించాలని ఆయనసూచించారు. అయిదేళ్ల కాలంలో కోటీ తొమ్మిది లక్షలమందిని అక్షరాస్యులుగా చేయాల్సి వున్నదనిఆయన తెలిపారు.

సంపూర్ణ అక్షరాస్యతపై ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత బాలకార్మికవ్యవస్థ సంపూర్ణ అక్షరాస్యతకు ప్రధానఅవరోధమని కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు. దీనిపైప్రతిస్పందిస్తూ వచ్చే నాలుగేళ్ల కాలంలోరాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను రద్దుచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రిపేర్కొన్నారు. ప్రభుత్వ కృషికి అన్ని పార్టీలు, ప్రజలుచేయూత నివ్వాలని ఆయన కోరారు. బాలకార్మికవ్యవస్థ రద్దును కాంక్షిస్తూ ముఖ్యమంత్రి చేసిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగాఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X