• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిణామాత్మక ఆంక్షల ఎత్తివేత

By Staff
|

న్యూఢిల్లీ: దేశీయ పరిశ్రమల ప్రయోజనం కోసం ఇంతకాలంగా అమలు చేస్తూ వచ్చిన పరిమాణాత్మక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. డబ్లుటివో ఒప్పందం ప్రకారం ఈ ఆంక్షల ఎత్తివేతకు మార్చి 31తో గడువు ముగుస్తున్నందున మొత్తం 715 వస్తువుల దిగుమతిపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి మురసోలి మారన్‌ ప్రకటించారు. 2001-2002 సంవత్సరానికి ఆయన కొత్త ఎగ్జిమ్‌ విధానాన్ని ప్రకటించారు.

కొత్త సంవత్సరంలో ప్రభుత్వం 18 శాతం ఎగుమతులను లక్ష్యంగాపెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసిన వస్తువుల జాబితాలో టెక్సైటైల్స్‌, వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్‌ పరికరాలతో పాటు మాంసం, మాంసం ఉత్పత్తులు, సిగరెట్లు, లిక్కర్‌, కొవ్వత్తులు, దువ్వెనలు, గ్రీటింగ్‌ కార్డ్స్‌ వంటివి కూడా వున్నాయి. ఆంక్షల ఎత్తివేత వల్ల దేశీయ పరిశ్రమలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మారన్‌ హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X