సోనియాపై ఎన్డిఎ పాత అస్త్రం
వాజ్పేయి దేశభక్తిని ప్రశ్నించే అర్హత సోనియాకు లేదని, ఆమె ఈ గడ్డపై పుట్టలేదన్న విషయాన్ని గుర్తు చేస్తు వారు వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అద్వానీ, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ఈ సభలో ప్రసంగించారు. ఎన్డిఎ నేతల ధోరణి చూస్తుంటే దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనజాగరణ ర్యాలీల్లో జాతీయత కార్డునే ప్రయోగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదిలా వుండగా1989 నుంచి కుదిరిన రక్షణ శాఖ ఒప్పందాలపై సివిసి సమర్పించిన నివేదికను పార్లమెంట్లో వుంచాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం ప్రధాని వాజ్పేయి తీసుకుంటారని అద్వానీ చెప్పారు. సివిసి నివేదికలో ఏమున్నదనే విషయం తాను బయటకు చెప్పనని అయితే గతంలో కుదిరిన ఒప్పందాలు సవ్యంగా లేవనే విషయం మాత్రం ఈ నివేదికలో వున్నదని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!