వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజరుద్దీన్‌ కేసువిచారణ 16న

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మ్యాచ్‌ఫిక్సింగ్‌ మచ్చపడి క్రికెట్‌ నుంచి జీవిత కాల నిషేధానికిగురైన అజరుద్దీన్‌ కేసు విచారణ ఈ నెల 16న జరుగుతుంది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ అజరుద్దీన్‌ హైదరాబాద్‌ లోని సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినవిషయం విదితమే. పిటిషన్‌ ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసును ఏప్రిల్‌ 16నవిచారణ జరపనున్నట్లు ప్రకటించారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై బిసిసిఐ ఒక ప్రత్యేకవిచారణ కమిషన్‌ ను నియమించి, ఆ కమిషన్‌ సిఫారసుల మేరకు అజర్‌, జడేజా, మనోజ్‌ ప్రభాకర్‌, అజయ్‌ శర్మలపై చర్య తీసుకున్నవిషయం విదితమే. అయితే సిబిఐ మాజీ డైరెక్టర్‌ మాధవన్‌ నువిచారణ కమిటీ సారధిగా ఏ ప్రాతిపతికన నియమించారని ప్రశ్నిస్తూ అజర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అజర్‌ తో పాటు అజయ్‌ జడేజా కూడా తనపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టులో కేసు పెట్టాడు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి, బిసిసిఐకి నోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X