వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుటిఐ బ్యాంకుకు జిటిబి తలాక్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతసంక్షోభానికి ఓ విధంగా కారణమైన గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ - యు.టి.ఐ. బ్యాంక్‌ లవిలీనం వ్యవహారం అటకెక్కింది. యుటిఐ బ్యాంక్‌ తోవిలీనం ప్రతిపాదనను రద్దు చేసుకోవాలని గ్లోబల్‌ట్రస్ట్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌ లో జరిగిన జి.టి.బి. డైరెక్టర్ల సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వ రంగ సంస్థఅయిన యు.టి.ఐ బ్యాంకుతో విలీనం కావాలనే ప్రతిపాదనకుస్వస్థి చెప్పాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.

అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ గా అవతరించే లక్ష్యంతో యు.టి.ఐ. బ్యాంక్‌ తో చేతులు కలపాలని జి.టి.బి ఈ ఏడాది జనవరిలో సంకల్పించింది. అయితే ఫిబ్రవరి లో లక్షణంగా వున్న జి.టి.బి.షేరు ధర ఈ ఒప్పందం తరువాత తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది.
ప్రస్తుత షేర్‌ మార్కెట్‌ సంక్షోభానికి ఈ విలీనం కూడా కొంతవరకు దోహదమైంది. జి.టి.బి.షేర్లలో అక్రమలావాదేవీలు జరిగాయనే అరోపణలు రావడంతో జిటిబిషేరు ధర అనూహ్యంగా పడిపోయింది. ఈ పరిణామాలను పరిశీలించిన బోర్డు యు.టి.ఐ.తో తెగతెంపులు చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఈవిషయాన్ని బోర్డు బుధవారం బి.ఎస్‌.ఇ.కి తెలియజేసింది.

జి.టి.బి. షేరు ధర పతనం అయినప్పటకీ తమ సంస్థ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల సంఖ్య అనూహ్యంగా 6.5 లక్షలకుపెరిగిందని, డిపాజిట్లు 25శాతం పెరిగాయని ఆ సంస్థ తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X