వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ కే ప్రజల మద్దతుఃఅద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః న్యాయవిచారణతో ఎన్డీఏ ప్రభుత్వంపై పడిన తెహల్కా మచ్చ మాసిపోతుందని బుధవారం హైదరాబాద్‌ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పలువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెహల్కా టేపుల వ్యవహారం అనంతరందేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వ నిర్వహిస్తున్న ర్యాలీలు, బహిరంగ సభల పరంపరలో భాగంగా హైదరాబాద్‌ లోని నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరిగింది. అద్వానీ, మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ బహిరంగ సభకు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.

తెహల్కా పెద్దగా సాధించింది ఏమీ లేనప్పటికీ వ్యవస్థలో వున్న లోపాలను బయటపెట్టిందని అద్వానీ అంగీకరించారు. ఎన్డీఏ సర్కార్‌ ను అస్థిరం పాలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తామని ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి వుంటుందని ప్రజల హర్షధ్వానాల మధ్య అద్వానీ ప్రకటించారు. కాంగ్రెస్‌ కంటే ఎన్డీఏ ప్రభుత్వం స్వచ్ఛమైన పాలన అందించగలదని ప్రజలకు అర్థం అయిందని అద్వానీ అన్నారు.

తెహల్కా ఉచ్చులో చిక్కుకొని రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జి ఫెర్నాండెజా ఈ సభలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. కాంగ్రెస్‌ - తెహల్కా ల కుట్రకు తాను, బంగారు లక్ష్మణ్‌ బలయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ శాఖలో దళారులను అడ్డుకున్నందుకే తనను బలిపశువును చేశారని ఆయన చెప్పారు. తెహల్కా టేపులన్నీ కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించగలదని ప్రజలు అర్థం చేసుకున్నారని జార్జి చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, విద్యాసాగర్‌ రావు, దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ఎన్టీఏ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సభకు దూరంగా వున్న విషయం విదితమే. ఈ సభకు ఊహించిన దానికంటే ఎక్కువగా జనం హాజరు కావడంతో బిజెపి వర్గాలలో ఆనందం వెల్లివిరిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X