వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్మ అక్రమాలపై ఆడియో సాక్ష్యాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సస్పెన్షన్‌కుగురైన సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌ బోర్డు చైర్మన్‌బి.పి. వర్మ అక్రమాలకు పాల్పడినట్లు తమవద్ద ఆడియో సాక్ష్యాలున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) చెప్పింది. వర్మకు, చెన్నైకి చెందిన ఎ కెఎంటర్‌ప్రైజెస్‌ యజమాని కె. విజయ్‌ ప్రతాప్‌కు మధ్యఅక్రమ డబ్బు లావాదేవీలు నడిచినట్లు తమవద్ద ఆడియో సాక్ష్యాలున్నట్లు సిబిఐ అధికారవర్గాలు చెప్పాయి.

విజయ్‌ ప్రతాప్‌కు, వర్మ,వర్మ కుమారుడు సిద్ధార్థ వర్మలకు మధ్యనడిచిన సంభాషణల ఆడియో టేప్‌లు తమవద్ద ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

వర్మ విదేశీ కన్‌సైన్‌మెంట్లనుక్లియర్‌ చేయడానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నవిజయ్‌ ప్రతాప్‌ నుంచి ఆర్థిక లబ్ధి పొందేవాడని, ఎకెఎంటర్‌ప్రైజెస్‌కు పనులు చేసి పెట్టాడనిచెప్పాయి. కన్‌సైన్‌మెంట్ల క్లియరెన్స్‌కు తానువర్మకు డబ్బులు ముట్టజెప్పినట్లు విజయ్‌ప్రతాప్‌ ఇంటరాగేషన్‌లో అంగీరించాడు. రెడీగార్మెంట్స్‌ కన్‌సైన్‌మెంట్‌ క్లియరెన్స్‌కు తానువర్మకు చెందిన కంపెనీ ఉద్యోగికి రెండు లక్షలరూపాయలు ముట్టజెప్పినట్లు విజయ్‌ ప్రతాప్‌దర్యాప్తు అధికారులతో చెప్పాడు. తనకు విజయ్‌ప్రతాప్‌ వర్మకు అందజేయడానికి రెండు లక్షలరూపాయలు ఇచ్చినట్లు అరెస్టయిన తర్వాత రాజీవ్‌ కుమార్‌ శర్మ అంగీకరించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X