వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలపక్షంతో తెహల్కా రగడకు చెక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః తెహల్కా వీడియో టేపులలో చిక్కుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఉచ్చు నుంచి బయటపడేందుకు గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. అఖలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా తెహల్కా ప్రతిష్ఠంభనకుస్వస్తి చెప్పాలని ప్రధాని నిర్ణయించారు. ఎన్డీఏ నిర్వహిస్తున్న ర్యాలీలను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే సోనియా గాంధీ సభలను కూడా అడ్డుకుంటామని ఎన్డీఏ హెచ్చరించింది.

ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి మయంగా మారిందనేవిషయాన్ని తెహల్కా వెల్లడించిన దరిమిలా వాజ్‌పేయి ప్రభుత్వం గద్దె దిగాలంటూ కాంగ్రెస్‌ తో సహా ప్రతిపక్షాలన్నీ ఉడుంపట్టు పట్టాయి. వారం రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింప చేశాయి. ప్రభుత్వం రాజీనామా చేసేవరకు పార్లమెంటును అడుగు ముందుకు కదలనివ్వమని అల్టిమేటం ఇచ్చాయి. పార్లమెంటు ఉభయసభలకు ఓ రెండు వారాల పాటుసెలవలు రావడంతో ప్రభుత్వం హాయిగా ఊపిరిపీల్చుకున్నది.

మళ్ళీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకొనేందుకు వాజ్‌పేయి అధ్యక్షతన సోమవారం సమావేశంమైంది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటును సజావుగా జరగనివ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరాలని కేంద్ర క్యాబినెట్‌ సంకల్పించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు దారికిరాకపోతే ఎదురు దాడి చేయాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది.

సమావేశం వివరాలను తెహల్కా సంక్షోభంతో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్జి ఫెర్నాండెజ్‌ పత్రికల వారికి వివరించారు. తెహల్కా వ్యవహారంపై బహిరంగంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వున్నదని, ఈవివాదాన్ని అడ్డం పెట్టుకొని పార్లమెంటు సమాయాన్ని వృధా చేయవద్దని ప్రతిపక్షాలను కోరతామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు మా విజ్ఞప్తిని పెడచెవిన పెడితే ఎదురు దాడి తప్పదని జార్జి హెచ్చరించారు.

సోనియా గాంధీ కార్యదర్శి జార్జి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో వెల్లడించాలని ఎన్డీఏ సవాలు చేసింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఏకతాటిపై వున్నాయని, భాగస్వామ్య పార్టీల మధ్య విబేధాలు వున్నాయనే వాదనను జార్జి ఫెర్నాండెజ్‌ ఖండించారు. ఎన్డీఏ ర్యాలీలు అన్నింటికీ భాగస్వామ్య పార్టీల మద్దతు వున్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X