వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ తీవ్రవాదానికిఅడ్డుకట్ట

By Staff
|
Google Oneindia TeluguNews

టెహ్రాన్‌: అంతర్జాతీయ తీవ్రవాదాన్ని భారత్‌,ఇరాన్‌లు సంయుక్తంగా ఖండించాయి. పాకిస్థాన్‌, అఫ్ఘనిస్తాన్‌లనుదృష్టిలో వుంచుకుని ఈ సంయుక్త ప్రకటనచేశాయి. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికిఅంతర్జాతీయంగా ఏకాభిప్రాయ సాధనకు కృషిచేయాలని ఉభయ దేశాలు అంగీకరించాయి. తాలిబన్లదుశ్చర్యలను అడ్డుకుంటామని ఖతామీ వాజ్‌పేయికిహామీ ఇచ్చారు.

నిర్ణీత కాలవ్యవధిలో అణ్వస్త్రనిరోధానికి అంతర్జాతీయంగా ఒక ఒప్పందం కుదరాల్సినఅవసరం వుందని నాలుగు రోజుల ఇరాన్‌ పర్యటనకువచ్చిన భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటుఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ మహ్మద్‌ ఖతామి అభిప్రాయపడ్డారు.టెహ్రాన్‌ డిక్లరేషన్‌పై ఉభయ దేశాల నేతలు సంతకాలుచేశారు. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పరస్పరసహకారం అందించుకోవాలని, సంయుక్తంగా కృషిచేయాలని టెహ్రాన్‌ డిక్లరేషన్‌అభిప్రాయడింది.

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంధనసహకారాలపై అవగాహనా పత్రాలపై సంతకాలుచేయడంతో పాటు ఇరు దేశాలు ఐదు ఒప్పందాలుకుదుర్చుకున్నాయి. ఇంధన, ట్రాన్సిట్‌, రవాణా,పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసు రంగాల్లో నిర్మాణాత్మక, పరస్పరప్రయోజనాల కోసం కృషి చేయాలని ఉభయదేశాలు నిర్ణయించుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X