వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వర్ణాంధ్రకు సహకరించండి Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రజలు తనతో సహకరిస్తే అనతికాలంలో తాను వాగ్ధనం చేస్తున్న స్వర్ణాంధ్రప్రదేశ్‌ను సాధించగలనని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం నాడు ప్రకాశం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు.

ప్రకాశం జిల్లా మర్లపాడులో 360 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి బ్రిజ్‌కిషోర్‌ త్రిపాఠితో కలసి ఆయన శంకు స్థాపన చేశారు. చదలవాడలో 2 కోట్ల 60 లక్షల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన పశుఉత్పత్తి క్షేత్రాన్ని ఆయన ప్రారంభించారు. గుండ్లకమ్మ వాగుమీద ఎత్తిపోతల పథకాలను అమలు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.

ప్రైవేట్‌ భాగస్వామ్యంలో జిల్లాలోని ఈతముక్కల వద్ద పోర్టును ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా వున్నదని ఆయన చెప్పారు. కాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉప్పనూతల గ్రామంలో జలయజ్ఞం కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా జలరక్షణకు ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు వెచ్చించినా ఫలితం లేదని ముఖ్యమంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X