వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎల్‌పి నేత మార్పు లేదు:అంబిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రకాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేతనుమార్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని కాంగ్రెస్‌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిఅంబికా సోనీ చెప్పారు. తెహెల్కా టేప్‌ల వెల్లడిపైమహబూబ్‌నగర్‌లో తలపెట్టిన ర్యాలీలో పాల్గొనడానికి ఆమె శనివారంహైదరాబాద్‌ వచ్చారు. సిఎల్‌పి నేత డాక్టర్‌వై.యస్‌. రాజశేఖరరెడ్డిని మార్చాలని కాంగ్రెస్‌సీనియర్‌ నేత కోట్ల విజయభాస్కర రెడ్డి ఎఐసిసిఅధ్యక్షురాలు సోనియాగాంధీకి విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరిగినవిషయం తెలిసిందే.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుఉద్యమం గురించి తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులుఅంబికా సోనీకి విజ్ఞప్తి పత్రం సమర్పించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ దాదాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగాహైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద గలఅంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు. ఆమెతో పాటు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు,కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఎస్‌. జైపాల్‌ రెడ్డిఅంబేడ్కర్‌కు నివాళులర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X