వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకుసిద్ధమే,కానీ..: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: తాను రాజీనామా చేయడానికిసిద్ధమేనని, అయితే తరువాతి ప్రధానిఎవరో తేలాల్సి వుందని ప్రధాని వాజ్‌పేయి అన్నారు. తనకుపదవిపై మోజు లేదని ఆయన అన్నారు.లక్నోలో ఏర్పాటయిన ర్యాలీలో ఆయనప్రసంగించారు. ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కుప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని ఆయన విమర్శించారు.దమ్ముంటే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంప్రతిపాదించాలని ఆయన సవాల్‌ విసిరారు.

అవినీతి జాతీయ వ్యాధి అని,దాన్ని రూపుమాపడానికి తన ప్రభుత్వం చర్యలుచేపట్టిందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు అనుభవరాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని,ప్రభుత్వాన్ని తక్కువ చేసే ఉద్దేశమే ప్రతిపక్షాలకుకనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అధికారంతోఆశతోనే ఇదంతా చేస్తున్నాయని, అవినీతి వాటికిపట్టదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ముఖ్యంగా,కాంగ్రెస్‌ ప్రవర్తన వల్ల దేశ ప్రతిష్ట దెబ్బ తింటోందనిఆయన అన్నారు.

ఈ ర్యాలీలో ఎన్‌డిఎ కన్వీనర్‌ జార్జిఫెర్నాండెజ్‌, కేంద్ర మంత్రి ఉమాభారతి, తదితరులుపాల్గొన్నారు.

పార్లమెంట్‌లో తేల్చుకుందాం

న్యూఢిల్లీ: ఏవిషయాన్నయినాపార్లమెంటులో తేల్చుకుందాం రమ్మంటూ వాజ్‌పేయి ప్రతిపక్షాలకు సవాల్‌విసిరారు. పార్లమెంటు సమావేశాలనుఆటంకపరిచేందుకు కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలుప్రయత్నిస్తున్నాయని ఆయనఆరోపించారు.లక్నోలో జరుగనున్న కిసాన్‌ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరే ముందుఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాల ప్రవర్తనచూస్తుంటే వాటికి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసంవున్నట్టు కనిపించటం లేదని ఆయన దుయ్యబట్టారు.

పార్లమెంటులో తెహల్కా బాణాన్ని తిరిగిసంధించేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ప్రధాని ఏర్పాటు చేసినఅఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్‌, ఆర్‌జెడిలుబహిష్కరించాయి. సమావేశానికి హాజరైనవామపక్షాలు సైతం ప్రధాని రాజీనామా విషయంలో వెనక్కుతగ్గేప్రశ్నేలేదని ప్రకటించాయి. ఈ నేపద్యంలో సమావేశాలు మరింతవాడిగా, వేడిగా సాగే అవకాశంవుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X