వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మయ్యతో పోలీసులకు సంబంధాల్లేవు: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పీపుల్స్‌వార్‌గ్రూప్‌ మాజీ నక్సలైట్‌ కత్తుల సమ్మయ్యతో కలిసిరాయలసీమ ఐజి కె.ఎస్‌.ఎన్‌. మూర్తి కుమారుడుకొలంబో వెళ్లలేదని, ఈ విషయంలో ఐజికుమారుడికి, సమ్మయ్యకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని పోలీసుడైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) హెచ్‌. జె. దొర స్పష్టంచేశారు. లొంగిపోయిన నక్సలైట్లను పోలీసులు ఏ రకంగా కూడాఉపయోగించుకోవడం లేదని, వారికి పునరావాసం కల్పించడంమినహా వారితో మరే సంబంధాలు పోలీసులకు లేవనిఆయన సోమవారం అన్నారు.

సమ్మయ్య ఈ ఏడాదిఫిబ్రవరిలో హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్‌ పొందినట్లుఆయన తెలిపారు. ఏరియల్‌ వార్‌ఫేర్‌ యుద్ధరీతుల్లో శిక్షణపొందడానికి పోలీసులే సమ్మయ్యను జర్మనీకి పంపారంటూవచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.చెన్నైకి చెందిన కొందరు వ్యాపారవేత్తలతో సంబంధాలు ఏర్పర్చుకుని విండ్‌మిల్‌ ప్రాజెక్టు కోసం జర్మనీకి బయలుదేరేందుకు ఈనెల 10వ తేదీ రాత్రి చెన్నై నుంచి సింగపూర్‌ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కొలంబో చేరుకున్నాడనిడిజిపి తెలిపారు. సమ్మయ్య తనతో పాటు మరోఐదుగురిని వెంట తీసికెళ్లినట్లు ఆయనచెప్పారు. చెన్నైకి చెందిన ఎస్‌. భాస్కరన్‌, ఎ.అబూబాకర్‌, డి. గణేషన్‌, అబ్దుల్‌ హక్‌, విజయవాడకుచెందిన నాజర్‌హుసేన్‌లు సమయ్య వెంటవున్నట్లు ఆయన చెప్పారు.

భాస్కరన్‌ కింగ్‌ కెమికల్స్‌డిస్టిలరీస్‌ ఎడ్యుక్యూటివ్‌ డైరెక్టర్‌ కాగా,ఆమొకో కనస్ట్రక్షన్స్‌లో అబూబాకర్‌ ఎరెక్షన్‌ఇంజనీర్‌గా, మీనా అండ్‌ కంపెనీలో ఆడిటర్‌గాగణేషన్‌, ఎ.హెచ్‌. కన్‌స్ట్రక్షన్స్‌లో సివిల్‌ఇంజనీర్‌గా, అబ్దుల్‌ హక్‌ చెన్నైలో పనిచేస్తున్నారని, జర్మనీకి చెందిన జెబివైక్‌కన్‌జ్యుమబుల్స్‌ అండ్‌ స్పేర్స్‌ కంపెనీలో నాజర్‌హుసేన్‌ ప్రతినిధిగా పని చేస్తున్నాడనిడిజిపి వివరించారు. నాజర్‌ హుస్సేన్‌కు,సమ్మయ్యకు హైదరాబాద్‌ నుంచి, మిగతావారికిచెన్నై నుంచి పాస్‌పోర్టు జారీ అయినట్లు ఆయన తెలిపారు.

కత్తులసమ్మయ్య ఇక లేరు

కత్తుల సమ్మయ్య గురించివివరణ ఇస్తూ డిజిపి కార్యాలయం నుంచి ఆయన తరఫునవిడుదలయిన ప్రకటనలో కత్తులసమ్మయ్య ఇక లేరు అనే శీర్షిక పెట్టడం విశేషం. 1993లోతాను పని చేసిన హుజూరాబాద్‌ వార్‌ దళకమాండర్‌తో పాటు మరో ఇద్దరిని హత్య చేసిఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయినసమ్మయ్య డిఐజి హత్య కేసులోప్రభుత్వానికి అప్రూవర్‌గా మారాడని డిజిపి ఆప్రకటనలో చెప్పారు. వార్‌

నక్సల్స్‌ నుంచిప్రాణభయం వున్న కారణంగా ఏడాది కాలంకేరళలో తలదాచుకున్న సమ్మయ్య తర్వాతహైదరాబాద్‌లో స్థిరపడి వ్యాపారం చేసుకుంటున్నాడనిఆయన వివరించారు.

ఇదిలావుండగా కొలంబోలో జరిగినవిమాన ప్రమాదంలో మరణించిన కత్తులసమ్మయ్య మృతదేహాన్ని అధికారులు సోమవారంఆయన భార్య సరోజకు అప్పగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X