వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 మంది భారత సైనికుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఢాకా: భారత్‌-బంగ్లా సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణల్లో 16 మంది భారతీయ సైనికులు మరణించినట్టుగా బంగ్లాదేశ్‌ సైనికాధికారులు ప్రకటించారు. మేఘాలయ రాష్ట్రంలోని కురిగ్రామ్‌లో ఉభయ దేశాల సైనికబలగాల మధ్య ఘర్షణ జరిగిందనీ ఈ ఘర్షణలో అనేకమంది గాయపడ్డారని కూడా బంగ్లా సైన్యం ప్రకటించింది.

భారత సైనికదళాలు ఏలాంటి కవ్వింపులేకుండా చొచ్చుకువచ్చి బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌కు చెందిన చెక్‌పోస్ట్‌పై కాల్పులు జరిపినట్టుగా బంగ్లా రైఫిల్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ ఫజ్లూర్‌ రహ్మాన్‌ ప్రకటించారు. ఈ దాడిని తమ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని, ఈ కాల్పుల్లో 16 మంది భారతీయ సైనికులు మరణించగా బంగ్లా సైనికుడు ఒక్కరు మరణించారని ఆయన తెలిపారు.

బంగ్లా సైనికులు సోమవారం రాత్రి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి 16 మంది బిఎస్‌ఎఫ్‌ జవాన్లను బందీలుగా పట్టుకున్నదని కూడా సమాచారం అందింది. భారత్‌-బంగ్లా సరిహద్దుల్లో కొంత కాలంగా ఉభయ దేశాల సైనికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో అనేక గ్రామాలపై రెండు దేశాల మధ్య వివాదం నడుస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X