వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో అదే ప్రతిష్టంభన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిష్టంభన తొలిగే అవకాశం కనిపించడం లేదు. పార్లమెంట్‌ ఉమ్మడి కమిటీతో తహల్కా కుంభకోణంపై పట్టుబడుతున్న కాంగ్రెస్‌ బుధవారం నాడు కూడా పార్లమెంట్‌ ఉభయ సభలను స్తంభింపజేసింది. అయితే తొలుత జెపిసి దర్యాప్తునకు తాము ముందుకు వచ్చినా కాంగ్రెస్‌తో విపక్షాలేవీ మాట్లాడలేదని అధికార పార్టీ అంటున్నది.

తహల్కాపై ఇప్పటికే జస్టిస్‌ వెంకటస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసినందున కొత్తగా జెపిసి దర్యాప్తు జరిపించాల్సిన అవసరంలేదని ఎన్‌డిఎ నేతలు అంటున్నారు. ప్రతిపక్షాల్లో కాంగ్రెస్‌ డిమాండ్‌కు కేవలం ఆర్‌జెడి మాత్రమే మద్దతునిస్తున్నది. కాగా మిగిలిన పార్టీలు మాత్రం సభలో చర్చకు సిద్ధంగా వున్నాయి. పార్లమెంట్‌లో ప్రతిష్టంభన తమకు కూడా యిష్టంలేదని ఎస్‌పి నేత ములాయం సింగ్‌ యాదవ్‌ చెప్పారు.

ప్రతిపక్షాల్లో అనైక్యతను ఆసరాగా చేసుకుని జెపిసి విషయంలో తాము గట్టిగానే వుండాలని అధికారకూటమి నిర్ణయించింది. పైగా కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీకి రష్యా గూఢచార సంస్థ కెజిబికి సంబంధం వున్నదంటూ వచ్చిన ఆరోపణలను కూడా తమకు అనుకూల పరిణామంగా ఎన్‌డిఎ నాయకులు భావిస్తున్నారు.

స్పీకర్‌ సమావేశం విఫలం
తహల్కాపై పార్లమెంట్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో లోకసభ స్పీకర్‌ బాలయోగి బుధవారం నాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం విఫలమైంది. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ ప్రతినిధులు తహల్కా కుంభకోణంపై జెపిసి దర్యాప్తు జరిపించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టి పట్టుదలతో వుండటంతో వ్యవహారం ఎటూ తెగలేదు. సమావేశం విఫలం కావడంతో పార్లమెంట్‌ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన తొలిగే అవకాశం కనిపించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X