వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ నమ్మక ద్రోహిః రంజన్‌ ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా : ఆర్‌జెడీ నేత లాలూప్రపాద్‌ యాదవ్‌పై అసంతృప్తినేత రంజన్‌ యాదవ్‌ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. పాట్నాలో ఆయన శనివారం మొదటిసారిగా లాలూపై బహిరంగంగా విరుచుకుపడ్డారు.

లాలూ నమ్మకద్రోహిఅని, నీతి నియమాలులేని వ్యక్తిఅని రంజన్‌ దుమ్మెత్తిపోశారు. లాలూ కష్టకాలంలో వున్నపుడు పార్టీ పటిష్టతకోసం, ఆయన క్షేమంకోసం ఎంతో పాటుపడిన తనను చివరకు వంచించాడని రంజన్‌ ఆరోపించాడు. గతంలో శరద్‌యాదవ్‌, నితీష్‌కుమార్‌, జార్జఫెర్నాండెజ్‌ లాంటి వారికి కూడా లాలూ ఇలాగే చేశారని రంజన్‌ గుర్తు చేశారు.

రంజన్‌ బహిరంగ విహర్శలతో ఆర్‌జెడీసంక్షోభం పూర్తగా బద్దలైంది. తమను 50 శాతంమందికిపైగా ఎమ్మల్యేలు బలపరుస్తున్నారని రంజన్‌ వర్గీయులు బహిరంగంగా చెబుతున్న నేపద్యంలో రబ్దీదేవి ప్రభుత్వానికి కూడా నూకలు చెల్లే ప్రమాదం వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X