వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుసమస్యలపై పిసిసి ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రైతు సమస్యల పరిష్కారానికిప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 28వ తేదీనుంచి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) ఆందోళనా కార్యక్రమాలుచేపట్టనుంది. ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు బుధవారం విలేకరులసమావేశంలో చెప్పారు. రైతు సమస్యలపై పిసిసిప్రతినిధులు ఇంత వరకు జిల్లాల పర్యటనలుచేశారు. ఇప్పుడు ఆందోళనా కార్యక్రమాలకుపూనుకుంటున్నారు. తమ ఆందోళనలో భాగంగా ఈనెల 28వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలునిర్వహించనున్నట్లు సత్యనారాయణరావుచెప్పారు.

తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని 28వ తేదీధర్నాల తర్వాత ఖరారు చేస్తామని ఆయనచెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుటెలీ, వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణ ద్వారా హడావిడిచేయడమే తప్ప రైతు సమస్యలను పరిష్కరించడంలేదని ఆయన విమర్శించారు. రైతుల ఉత్పత్తులసేకరణకు ప్రభుత్వం వద్ద కార్యాచరణ ప్రణాళికలేదని, ఇప్పటికే రైతుల వద్ద నిల్వలువుండగా కొత్త పంట చేతికి వస్తోందని, దీన్ని ప్రభుత్వంపట్టించుకోకుండా నిద్ర పోతోందని ఆయన అన్నారు. రైతు సమస్యలనుపరిష్కారించాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికిలేదని

ఆయన విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికితానెన్ని మార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రంపట్టించుకోవడం లేదని చంద్రబాబు అంటున్నారని, సమస్యలను

పరిష్కరించాలనే చిత్తశుద్ధివుంటే కేంద్రానికి తెలుగుదేశం మద్దతుఉపసంహరించుకుంటే సరిపోతుందని ఆయనఅన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మద్దతుఉపసంహరించుకుంటానంటే కేంద్రం దిగివస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X