వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరారీలో ఐపిఎస్‌ భార్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లామియాపూర్‌లో లైసెన్స్‌ లేకుండా నడుస్తున్నప్రీషియస్‌ మూమెంట్‌ శిశు దత్తత కేంద్రంనిర్వాహకురాలు, సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి భార్యఅనితాసేన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంస్థ చైర్మన్‌ రెవరెండ్‌పీటర్‌, అనితాసేన్‌ పరారీలో వున్నట్లు పోలీసు వర్గాలుచెప్పాయి. ఈ సంస్థపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖఅధికారులు కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లోఫిర్యాదు చేశారు. సెంటర్‌ ఫర్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ఏజెన్సీ (కారా) అధికారులు బుధవారం దాడి చేసి రికార్డులునుస్వాధీనం చేసుకున్నారు. సంస్థను సీజ్‌చేశారు.

ఈ సంస్థ నుంచి 54 మంది పిల్లలనుస్వాధీనం చేసుకుని శిశు విహార్‌కు తరలించారు.ఇందులో ముగ్గురు మగపిల్లలు కూడా వున్నారు.ఇందులో అనారోగ్యంగా వున్న నలుగరు పిల్లలనునీలోఫర్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఈ సంస్థ పిల్లలనుమాజీ మంత్రి రోడామిస్త్రీ నడుపుతున్న ఇండియన్‌కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ (ఐసిఎస్‌డబ్ల్యు)కువిక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్రస్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు.

కారా ప్రతినిధులు గురువారం కూడా పిల్లల దత్తతకేంద్రాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంకావాలంటే మరిన్ని రోజులు దాడులు నిర్వహిస్తామని కారాప్రతినిధులు చెప్పారు. హైదరాబాద్‌లోనిఎర్రగడ్డలోనూ, విజయనగర్‌ కాలనీలోనూనడుస్తున్న దత్తత కేంద్రాలపై గురువారం కారాప్రతినిధులు దాడులు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని ఒక దత్తతకేంద్రం నుంచి కూడా ఆరుగురు పిల్లలను శిశువిహార్‌కు తరలించారు. ఇప్పటివరకు 174 మంది పిల్లలను శిశు విహార్‌కు తరలించారు. అవకతవకలకు పాల్పడినఐసిఎస్‌డబ్ల్యుపై ఏం చర్య తీసుకోవాలనేది ఆలోచిస్తున్నట్లు కారా ప్రతినిధిసరస్వతి అన్నారు. దత్తత కేంద్రాలు పిల్లలను ఎక్కడినుంచి సేకరిస్తున్నారనేది రికార్డు చేయడంలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని స్త్రీ, శిశు సంక్షేమడైరెక్టర్‌ శాలినీ మిశ్రా అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ లైసెన్స్‌లతోనడుస్తున్న పిల్లల దత్తత కేంద్రాలను కూడానియంత్రించలేకపోయామని రాష్ట్ర హోంమంత్రి తూళ్లదేవేందర్‌ గౌడ్‌ అంగీకరించారు. శిశువిహార్‌లోని పిల్లల ఆలనా పాలనా చూడడం తలకుమించిన భారమేనని ఆయన అన్నారు. సేవాభావంతో కూడిన ఉత్తమస్వచ్ఛంద సంస్థలకు వారిని అప్పగిస్తామని ఆయనఅన్నారు.

దత్తత చట్టం దుర్వినియోగం కాకుండాచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అక్రమాలు, అవకతవకలనునిరోధించేందుకు దీర్ఘకాలిక కార్యక్రమాన్నిరూపొందించి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దత్తతపేరుతో అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడాఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X