వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్‌ నేరానికివిద్యార్థి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సైబర్‌ నేరానికి పాల్పడిన పాఠశాలవిద్యార్థిని ఒకరిని అరెస్టు చేసి జ్యుడిషియల్‌కస్టడీకి పంపినట్లు సమాచారం. తన క్లాస్‌మేట్స్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పాఠశాలవిద్యార్థి సైబర్‌ నేరానికి పాల్పడ్డాడు. తన క్లాస్‌మేట్స్‌ ఫొటోలను పోర్నోగ్రాఫిక్‌వెబ్‌సైట్‌లో చేర్చాడు. ఈ పదహారేళ్ల విద్యార్థి స్క్రాడ్రన్‌లీడర్‌ కుమారుడు. న్యూఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్‌ నడుపుతున్న బాలభారతి పాఠశాలకు హాజరవుతున్నాడు.

భారతదేశంలో ఇటువంటి కేసునమోదు కావడం ఇదే ప్రథమం. క్రైమ్‌ బ్రాంచ్‌ స్పెషల్‌ సైబర్‌సెల్‌ చేసిన ఆరోపణలు రుజువైతే ఆ విద్యార్థికిజైలు శిక్ష పడుతుంది. సైబర్‌ పోర్నోగ్రఫీకిపాల్పడినవారిని పార్లమెంటు నిరుడు అక్టోబర్‌లోఆమోదించిన భారత సమాచార సాంకేతిక చట్టంకింద విచారిస్తారు. దోషులకు మూడు లక్షలరూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల వరకుజైలు శిక్ష పడే అవకాశం వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X