వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థంతర వాయిదాకుబాలయోగి విచారం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభబడ్జెట్‌ సమావేశాలను ఎనిమిది రోజులుకుదించినందుకు స్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి విచారంవ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల, పాండిచ్చేరికేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలప్రచారంలో పార్లమెంటు సభ్యులు పాల్గొనడానికివీలు కల్పించేందుకే సమావేశాలను అర్థాంతరంగానిరవధికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.

నిర్ణీత వ్యవధి కన్నా ముందుగానే సమావేశాలనువాయిదా వేయడాన్ని ప్రత్యేక పరిస్థితిగానే చూడాలి తప్ప భవిష్యత్తులోదీన్ని సంప్రదాయంగా తీసుకోకూడదని ఆయనఅన్నారు.

సభలోని పరిమాణాలు అందరితో పాటు తనను కూడావేదనకు గురి చేశాయని ఆయన అన్నారు. లోక్‌సభ ప్రతిష్టంభననుంచి, తుది ఫలితం నుంచి సభలోని ప్రతి ఒక్కరూ పాఠంనేర్చుకోవాలని ఆయన అన్నారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకూడదనిఆయన అన్నారు. పార్లమెంటును చట్టపరమైన,ఆర్థికపరమైన వ్యవహారాలపై, ఇతర ప్రజా ప్రాముఖ్యఅంశాలపై అర్థవంతమైన చర్చకు ఉద్దేశించినట్లు,పాలక, ప్రతిపక్ష సభ్యులు ఈ చర్చలను చేపట్టడానికిఉద్దేశితమైందని ఆయన అన్నారు.

ప్రజాస్వామిక సంస్థలు పరస్పరవిశ్వాసంతో, సహకారంతో నడవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన భావాలను అదృష్టవశాత్తు ప్రధానివాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, ఇతర పార్టీల నేతలు పంచుకున్నారనిబాలయోగి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X