వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీన్‌ దార్‌ అంజుమన్‌ పై నిషేధం వేటు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, గోవా రాష్ట్రాలలో పలు ప్రార్థనా స్థలాలలోపేలుళ్ళకు కారణమైన దీన్‌ దార్‌ అంజుమన్‌ సంస్థను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. ఈ సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రకటించారు. దీన్‌ దార్‌అంజుమన్‌ సంస్థ హైదరాబాద్‌ తో పాటు గుంటూరు,విజయవాడ తదితర పట్టణాలలోని ప్రార్థనా స్థలాలను బాంబులతోపేల్చివేసిన విషయం విదితమే. ఫలితంగా ప్రశాంతంగా వుండే కోస్తా జిల్లాలలో సైతం మత కల్లోలానికి ఈ సంస్థ కారణమైంది.

కృష్టా జిల్లా నూజివీడు కేంద్రంగా ఈ సంస్థ భారీగావిస్తరించి, విదేశీ నిధులతో పెద్ద ఎత్తున విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడింది. కర్నాటకలో కూడా ఈ సంస్థ ప్రార్థనా స్థలాలనుపేల్చి వేసి విధ్వంసానికి పాల్పడింది.

దీన్‌ దార్‌ అంజుమన్‌ సంస్థను నిషేధించాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక ప్రభుత్వాలు కేంద్రాన్నికోరాయి. ఫలితంగా ఈ సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా కేంద్రం గురువారం ప్రకటించింది. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడంతో పాటు అంతరంగిక భద్రతకు ఈ సంస్థ ముప్పు కలిగిస్తున్నదని హోం మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X