• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెన్నయ్‌ లోవిమానంకూలి పైలట్‌ మృతి

By Staff
|

చెన్నయ్‌ః చెన్నయ్‌ సమీపంలో ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ శిక్షణవిమానం కూలిపోవడంతో పైలట్‌ దుర్మరణం పాలయ్యాడు. చెన్నయ్‌ శివార్లలోని వడలూరులో గల అన్నా జూలాజికల్‌ పార్క్‌ లో కిరణ్‌ మార్క-1 శిక్షణవిమానం గురువారం కూలిపోయింది.

ప్రమాదాన్ని ముందే గ్రహించిన పైలట్‌ విమానం నుంచి దూకేశాడు. అయితే అతనికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. తాంబరం లోని వైమానిక దళ స్థావరం నుంచి ఉదయం పది గంటల ప్రాంతంలో టేకాఫ్‌ తీసుకున్నవిమానం బయలుదేరిన కొద్ది సేపటికే జూలోని లయన్‌ సఫారీలో కూలిపోయింది. పులులకు ఎటువంటి హాని జరగలేదని జూ అధికారులు చెప్పారు.పైలట్‌ సంజయ్‌ గౌర్‌ జూ సమీపంలోని అటవీ ప్రాంతంలో 120 అడుగుల ఎత్తునుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించనట్లు అధికారులువివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X