• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రశేఖర్‌పై బిజెపి నిప్పులు

By Staff
|

హైదరాబాద్‌ః ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం అవసరం లేదని, గతంలో వున్న ప్రత్యేక ప్రతిపత్తిని కొనసాగించాల్సిందిగా మొదట బిజెపి మాత్రమే ప్రతిపాదించిందని బి.జె.పి. రాష్ట్ర శాఖ తెలిపింది. ప్రత్యేక తెలంగాణా విషయంలో తమపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ చంద్రశేఖరరావు చేస్తున్న వ్యాఖ్యలపై బిజెపి ధ్వజమెత్తింది. తమను విమర్శించే నైతిక హక్కు చంద్రశేఖర రావుకు లేదని ఆ పార్టీ నేతలు శుక్రవారం హైదరాబాద్‌ లో విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

బిజెపి నేతలు ఎవరూ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సమితిలో చేరే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. తెలంగాణా ఉద్యమం పై బిజెపి రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నదంటూ చంద్రశేఖర రావు విమర్శించారు. దీనిపై బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాపై తమ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగివుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. మొత్తం మీద తెలంగాణా ఉద్యమం విషయంలో చంద్రశేఖర రావు బిజెపిని ఇరకాటంలో పెట్టడంలో సఫలం అయ్యారు.

బిజెపి నేతలు ఎవరూ తెలంగాణా ఉద్యమంలో చేరరంటూ ఆ పార్టీ ప్రకటిస్తున్నప్పటికీ చంద్రశేఖర రావు వెంట ఎక్కవ మంది ప్రస్తుత, మాజీ బిజెపి నేతలో దర్శనం ఇవ్వడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X