వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఎమ్మెల్యేలుటిఆర్‌ఎస్‌లో చేరరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ పార్టీ శాసనసభ్యులెవరూ తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)లో చేరబోరని బిజెపి స్పష్టంచేసింది. తెలంగాణా రాష్ట్ర సమితి నేత కె. చంద్రశేఖర్‌రావుపై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి జి.కిషన్‌ రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ తీవ్రంగాధ్వజమెత్తారు. ఏ ఎండకా గొడుగు పట్టే చంద్రశేఖర్‌ రావుకుకచ్చితమైన వైఖరి లేదని వారన్నారు.

తమ పార్టీ శాసనసభ్యులెవరు కూడా తెలంగాణా రాష్ట్ర సమితికార్యక్రమాల్లో పాలు పంచుకోబోరని వారుచెప్పారు. చంద్రశేఖర్‌రావు కావాలని అపోహలుకలిగించే విధంగా మాట్లాడున్నారని వారన్నారు. ప్రత్యేక తెలంగాణాపై బిజెపి శాసనసభ్యులు పార్టీకి లేఖరాయడాన్ని విలేరులు ప్రస్తావించగా ఈ విషయాన్నిత్వరలో జరగునున్న పార్టీ పదాధికారులసమావేశంలో చర్చిస్తామని కిషన్‌ రెడ్డిచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X