వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కె-జి బేసిన్‌లోపెరుగనున్న ఉత్పత్తి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి : మరో రెండునెలల్లో ఆరుకు పైగా బావుల ద్వారా కృష్ణా-గోదావరిబేసిన్‌లో రోజుకు 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల మీటర్ల అదనపు ఆయిల్‌ మరియూ సహజవాయువులను ఉత్పత్తి చేయనున్నట్టు ఓఎన్‌జిసి తెలిపింది. ప్రస్తుతం రోజుకు 4.7 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను కె-జి బేసిన్‌ ఉత్పత్తి చేస్తోంది. తూర్పు- పశ్చిమ గోదావరి,కృష్ణా జిల్లాలలోని నరసాపురం, అంతర్వేది, పసర్లపూడి, పొన్నమండలలో ఈ బావులు వున్నట్టు ఓన్‌జిసి ప్రతినిధి తెలిపారు.

ఈ బావులలో రెండింటినుంచి గ్యాస్‌ కలెక్షన్‌ స్టేషన్ల వరకూ పైప్‌లైన్ల ఏర్పాటు పూర్తయ్యిందని, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమయ్యే జూన్‌ రెండవ వారం లోపు మొత్తం పని అంతా పూర్తవుతుందని ఆయన తెలిపారు.
ఈ బావులనుంచి గతంలో 1000 టన్నులు ఉండిన క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి ప్రస్తుతం 800 టన్నులకు పడిపోయిందని అన్నారు. నీరు బావులోకి ప్రవేశించటంతో ఏర్పడిన సాంకేతిక లోపాలే ఉత్పత్తి పడిపోయేందుకు కారణమని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X