వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రెష్‌ గా వుండేందుకేకొకైన్‌ః ఫర్దీన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః బాలీవుడ్‌ వర్థమాన నటుడు ఫర్దీన్‌ఖాన్‌ ను మాదకద్రవ్యాలు తీసుకుంటున్నాడనే ఆరోపణపై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆదివారంఅరెస్టు చేశారు. ఆయనను ఆదివారం నాడే మెజిస్ట్రేట్‌ ఎదుటహాజరుపరచారు. ఫర్దీన్‌ ఖాన్‌ ను ఈ నెల 18 వరకువిచారణ కోసం రిమాండ్‌ కు పంపుతూ మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఫర్దీన్‌అరెస్టు హిందీ సినీ రంగంలో సంచలనం సృష్టించింది.

ఫర్దీన్‌ ఖాన్‌ ప్రముఖ హిందీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఫిరోజ్‌ఖాన్‌ కుమరుడు. సుమారు 480 డాలర్ల విలువగల 9 గ్రాములకొకైన్‌ ఫర్దీన్‌ ఖాన్‌ వద్ద లభించింది. మాదకద్రవ్యాలను కలిగి వుండడం నేరం కాబట్టి ఫర్దీన్‌ నుఅరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. ఎప్పుడూ ఫ్రెష్‌ గా వుండేందుకువీలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నానని ఫర్దీన్‌ అంగీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫర్దీన్‌ తో పాటు మరో ఆరుగురు హిందీ సినీ ప్రముఖులపై కూడా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో వల పన్నినట్లు అనధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలిస్తున్నది.

బాలీవుడ్‌ నటుడుఫర్దీన్‌ఖాన్‌ అరెస్టు
ముంబాయి: ప్రముఖ దర్శకుడు, నటుడుఫిరోజ్‌ ఖాన్‌ కుమారుడు ఫర్దీన్‌ ఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌బ్యూరో శనివారం ఉదయం అరెస్టు చేసింది. డ్రగ్స్‌ కలిగి వున్నాడనేఆరోపణపై బ్యూరో ఫర్దీన్‌ ఖాన్‌ను అరెస్టుచేసింది. రక్త పరీక్ష కోసం ఆ తర్వాత ఆస్పత్రికి తీసికెళ్లారు.

ఫర్దీన్‌ ఖాన్‌ నటించినప్యార్‌ తునే క్యా కియా ఇటీవలే విడుదలయింది.ఆయన తొలిసారి నటించిన ప్రేమ్‌ అగ్గన్‌బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టింది. ఆయన ఐదుసినిమాల్లో నటించడానికి అంగీకరించినట్లుసమాచారం. చలన చిత్ర రంగంలో భవిష్యత్తునుపరీక్షించుకోవడానికి రెండవ సారి చేస్తున్నఆయన ప్రయత్నాలకు ఈ అరెస్టు విఘాతంకలిగించగలదని భావిస్తున్నారు. ఆయన నటించినమరో చిత్రం లవ్‌ కె లియే కుచ్‌ భీకరేగా అనే చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X