వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరిగొచ్చిన టిటో

By Staff
|
Google Oneindia TeluguNews

మాస్కో: అంతరిక్షంలో ఎనిమిది రోజుల పాటు విహరించి వచ్చిన అమెరికా కుబేరుడు డెన్నిస్‌ టిటో ఆదివారం నాడు సురక్షితంగా తిరిగివచ్చారు. తన అంతరిక్ష యాత్ర అద్భుత అనుభవమని స్వర్గానికి వెళ్లివచ్చినట్టుగ వున్నదని ఆయన ప్రకటించారు. అమెరికాతో స్పర్ధలకు కూడా సిద్ధపడి 60 ఏళ్ల టిటోను కమర్షియల్‌ ప్రాతిపదికన అంతరిక్ష కేంద్రానికి రష్యా పంపిన విషయం విదితమే. టిటోకు తోడు మరో ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములు కూడా వెళ్లారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో టిటో బృందం వున్న సోయజ్‌ అంతరిక్ష క్యాప్సూల్‌ కజికిస్తాన్‌ ఎడారిలో సురక్షితంగా దిగడంతో ఈ యాత్ర ఆరంభం నుంచి గుండెలుగ్గబట్టుకుని వున్న రష్యన్‌ శాస్త్రవేత్తలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. టిటో యాత్ర విజయవంతం కావడంతో ఇక దండిగా కాసులు వుండి అంతరిక్షంలో విహరించదల్చుకున్న కుబేరులు తమ కోరిక తీర్చుకోవడానికి మార్గం సుగమం అయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X