• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫర్దీన్‌ కు బెయిలుపై 10న నిర్ణయం

By Staff
|

ముంబయ్‌ఃకొకైన్‌ వాడుతూ పట్టు పడిన బాలీవుడ్‌ వర్థమాన నటుడు ఫర్దీన్‌ఖాన్‌ కు బెయిలు ఇచ్చే విషయాన్ని ముంబయ్‌ హైకోర్టు ఈ నెల పదికి వాయిదా వేసింది.కొకైన్‌ కలిగి వున్న ఫిరోజ్‌ ఖాన్‌ కుమారుడు ఫర్దీన్‌ఖాన్‌ ను ముంబయ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసినవిషయం విదితమే. ఫర్దీన్‌ ను ఈ నెల 18 వరకు రిమాండుకు పంపారు. అయితే అతనికి బెయిలు మంజూరు చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ పై ముంబయ్‌ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

మాదక ద్రవ్యాల నిరోధక శాఖ వాదనలు విన్న న్యాయమూర్తి బెయిలు పిటిషన్‌ పై తీర్పును ఈ నెల పదికి వాయిదా వేశారు. ఫ్రెష్‌ గా వుండేందుకే కొకైన్‌ వాడుతున్నట్లు ఫర్దీన్‌ ఖాన్‌ అంగీకరించగా, తన కుమారుడు తప్పు చేసినట్లు ఫిరోజ్‌ ఖాన్‌ అంగీకరించిన విషయం విదితమే.

ఫర్దీన్‌పైఅభియోగాల ఉపసంహరణ
ముంబాయి: మాదక ద్రవ్యాల వినియోగం కేసులో ఇరుక్కున్న వర్ధమాన బాలీవుడ్‌ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌ పై ఆభియోగాలను ఉపసంహరిస్తున్నట్టుగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. నార్కోటిక్స్‌ బోర్డు ఏజెంట్స్‌కు పట్టబడిన సమయంలో ఫర్ధీన్‌ఖాన్‌ వద్ద పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు లేవని అందువల్ల బోర్డు చీఫ్‌ అజయ్‌ ఉబాలె చెప్పారు.

ప్రముఖ నిర్మాత, నటుడు ఫిరోజ్‌ఖాన్‌ కుమారుడైన ఫర్ధీన్‌ ఖాన్‌ను మరో ఇద్దరిని కోకైన్‌ కొనుగోలు చేస్తుండగా అధికారులు హఠాత్తుగా దాడిచేసి పట్టుకున్న విషయం విదితమే. 10 గ్రాముల కంటే తక్కువ మోతాదులో నిషిద్ధ మాదకద్రవ్యాలతో పట్టుబడిన వారి విషయంలో భారతీయ చట్టాలు ఉదారంగానే వున్నాయి. ఎక్కువ మోతాదులో వీటితో పట్టుబడిన వారికి మాత్రం 10 జైలు శిక్ష ఆపై లక్ష రూపాయల వరకు జరిమాన విధించే అవకాశం వుంది.

అరెస్టయిన సమయంలో ఫర్దీన్‌ఖాన్‌ వద్ద కేవలం 9 గ్రాముల కోకైన్‌ మాత్రమే వున్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఉల్లాసం కోసం మాదకద్రవ్యాలను వాడే అలవాటు తనకు వున్నట్టుగా ఫర్దీన్‌ ఖాన్‌ ఒప్పుకున్నారు కూడా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X