వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌ వెబ్‌సైట్‌ హ్యాకర్ల గుర్తింపు

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూరుః భారత దేశానికి చెందిన ప్రముఖ ఐ.టి.సంస్థ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ వెబ్‌సైట్‌ ను హ్యాక్‌ చేసిన వారిని మంగళవారం గుర్తించారు. ఒకవిద్యా సంస్థ తమ కంపెనీకి చెందిన బ్యాంకింగ్‌ వెబ్‌సైట్‌ ను హ్యాక్‌ చేసినట్లు ఇన్ఫోసిసి ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి ఆధారాలతో ఆవిద్యా సంస్థను సంప్రతిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఇన్ఫోసిస్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన వెబ్‌సైట్‌ ను హ్యాకర్లు అశ్లీల రాతలతో హ్యాక్‌ చేశారు.

ఈ సంఘటనతో దిగ్భ్రాంతి చెందిన ఇన్ఫోసిస్‌ సంస్థ హుటాహుటినహ్యాక్‌ చేసిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. కొద్ది గంటల్లోనేహ్యాక్‌ కు గురైన వెబ్‌ సైట్‌ లో మార్పులు చేసి సక్రమంగా తీర్చిదిద్దినట్లు సంస్థ చెప్పింది. తమ సంస్థ వెబ్‌సైట్‌ ను హ్యాక్‌ చేసిన వారిపై చర్యకు సిద్ధం అవుతున్నట్లు ఇన్ఫోసిస్‌ అధికారులు చెప్పారు. భారత దేశానికి చెందిన ప్రముఖ సంస్థ వెబ్‌సైట్‌ సోమవారం హ్యాక్‌ కు గురైన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినవిషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X