• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కులవివక్షపై అఖిలపక్షం ఆందోళన

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నేటికీ కులవివక్షత కొనసాగడం పట్ల బుధవారం నాడు ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో దళితులను ఆలయాల్లోకి రానివ్వకపోవడం, హోటళ్లలో రెండుగ్లాసుల విధానం వంటి అనాగరిక పద్దతులు కొనసాగుతున్నాయని సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆందోళనవ్యక్తం చేశారు.

హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయపార్టీల నేతలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కులవివక్ష పోరాట కమిటీ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచార ఉద్యమం వివరాలను ఈ సమావేశంలో కమిటీ నాయకులు వివరించారు. చాలా సందర్భాల్లో పోలీసులు ఈ కులవివక్ష నిర్మూలనకు సరైన తీరులో ప్రతిస్పందించడం లేదని పోరాట కమిటీ నాయకులు ఆరోపించారు. కులవివక్షకు సంబంధించిన కేసులో విషయంలో తాము తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులు వివరించారు. అయితే ఈ వివరణపై వామపక్షపార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కులవివక్ష నిర్మూలనకు పోలీసులు సహకరించాలని లేనిపక్షంలో కఠినచర్య తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X