• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఘనాలో 120 మంది మృతి

By Staff
|

అక్రా: ఘనా రాజధాని ఆక్రాలో ఫుట్‌బాల్‌మ్యాచ్‌ సందర్భంగా చెలరేగినహింసాకాండలో 120 మంది మరణించారు అంతకుమించిగాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక రేడియో గురువారం ప్రసారంచేసింది.

హార్ట్‌ ఆఫ్‌ ఓక్‌ 2-1 తేడాతో విజయం సాధించడంతో ఈవిధ్వంస కాండ మొదలైంది. ప్రత్యర్థి టీమ్‌మద్దతుదారులు ఆక్రా స్పోర్ట్స్‌ స్టేడియంలోవిధ్వంసానికి దిగారు. మైదానంలోకి సీట్లను, సీసాలను విసరడంమొదలు పెట్టారు. గుంపును భయపెట్టి శాంత పరచడానికి పోలీసులుటియర్‌ గ్యాస్‌ వదిలారు. భయాందోళనలకుగురైన ప్రజలు ఎటు పడితే అటు పరుగులు తీయడం ప్రారంభించారు.స్టేడియం గేట్లు మూసి వుండడంతో తొక్కిసలాటజరిగింది. మృతులను సంఖ్య ఎంతనేదిఅధికారిక లెక్కలేమీ లేవు. 53 మంది క్షతగాత్రులతో పాటు 102మంది మృతదేహాలు వున్నట్లు ఆక్రా మిలటరీ ఆస్పత్రిడైరెక్టర్‌ జనరల్‌ డాన్‌ త్వుమ్‌ చెప్పారు.

ఈ విధ్వంసకాండలో 120 మందిమరణించినట్లు ప్రయివేట్‌ రేడియో ఎఫ్‌ఎంప్రకటించింది. ఇంకా ఐదు మృతదేహాలను పోలీసు ఆస్పత్రికి, 13మృతదేహాలను స్థానిక ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించినట్లు కూడాప్రకటించింది. మరో 150 మంది గాయపడినట్లు ఈ రేడియోప్రకటించింది.

ఈ ఘోర ప్రమాదంపై విచారణ సంఘాన్నినియమిస్తామని ఘనా అధ్యక్ష వ్యవహారాల మంత్రి జాక్‌ఒబెట్సెబి-లాంప్టే ప్రకటించారు. 40 వేల మంది ప్రేక్షకులుకూర్చోవడానికి వీలున్న స్టేడియం గేట్లకు తాళాలువేయడం వల్లనే ఇంత పెద్ద యెత్తున విధ్వంసకాండజరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more