• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్‌లో సిపిఎం కార్యకర్త హత్య

By Staff
|

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో గురువారం నాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు జరిపిన బాంబుదాడిలో ఒక సిపిఎం కార్యకర్తమరణించాడు. ఈ విషయం ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్జీ వెల్లడించారు.

ఖర్ధా నియోజకవర్గంలోని కుమర్‌పరా గ్రామంలో ఈ దాడి జరిగినట్టుగా తెలిపారు. కాగా ఈ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసు ప్రకటించారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలింగ్‌ స్టేషన్‌పై దాడి చేసి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. హింసాకాండకు దిగిన అల్లరిమూకలపై పలుచోట్ల పోలీసులు బలప్రయోగం చేయాల్సివచ్చిందని రాష్ట్ర డిజిపి వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X